బిగ్ బాస్ సీజన్ 6 మొదలైంది. ఇప్పటికే నిన్న ఈ షోని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. ఇక ఈ రోజు కంప్లీట్ గా కంటిస్టెంట్ లు అందరూ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే హౌస్ లోకి వెళ్లబోయే కంటిస్టెంట్ లు ఎవరనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ఈ సారి సీజన్ లో 19 మంది కంటిస్టెంట్ లు హౌస్ లోకి వెళ్తునన్నారు. వారిలో కొంత మంది వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ హౌస్ మేట్స్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ హాట్ కథనాలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సారి పోటీ మరింత రసవత్తరంగా ఉంటుందనే మాట కూడా వినిపిస్తుంది. ఇక సీజన్ 6 కోసం కింగ్ నాగార్జున తనదైన శైలిలో హోస్ట్చేయడానికి రెడీ అయిపోయారు. ఇక ఈ సీజన్ కి సంబంధించి నాగార్జున తీసుకోబోతున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సీజన్ లో ఒక్కో ఎపిసోడ్ కి నాగార్జున ఏకంగా 55 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంటే వారంలో శని, ఆదివారాలు ప్రసారం అయ్యే ఎపిసోడ్స్ రెండింటికి కోటి పది లక్షల వరకు కింగ్ నాగార్జునకి పారితోషికంగా అందుతుంది.
ఈ లెక్కన వీకెండ్ లెక్కన చూసుకుంటే 16.50 కోట్ల రెమ్యునరేషన్ 15 వారాలకి గాను కింగ్ నాగార్జున అందుకోబోతున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో రియాలిటీ షో కోసం రెమ్యునరేషన్ అందుకోవడం ఇదే మొదటి సారి అని చెప్పాలి. అయితే తెలుగుతో పోల్చుతుంటే హిందీలో సల్మాన్ ఖాన్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆ తరువాతి స్థానంలో తెలుగు నుంచి కింగ్ నాగార్జునకి అత్యధిక రెమ్యునరేషన్ ని బిగ్ బాస్ నిర్వాహకులు ఇస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్