Bigg Boss keerthi bhat: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదివారం సాయంత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ షో ఒక్కొక్క కంటెస్టెంట్ రావటం స్టెప్పులు వేయటం వారి గురించి ఇంట్రడక్షన్ సీన్స్ చూపించడం తర్వాత వేదికపై నాగార్జున వారిని పలు ప్రశ్నలు వేయటం ఎంతగానో షో ఆకట్టుకుంది. గత రెండు సీజన్ లలో కరోనా కారణంగా పెద్ద ఆర్భాటంగా ఏమి చేయలేదు. కానీ ప్రస్తుతం కరోనా ఉద్రిక్తత తక్కువ కావడంతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఓపెనింగ్ కార్యక్రమం చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా జరిగింది.
పోటీదారులలో చాలామంది మోడలింగ్ ఇంకా సీరియల్ యాక్టర్స్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా ఉన్నారు. దీనిలో భాగంగా తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ మోస్ట్ సీరియల్ “కార్తీకదీపం” ఫేమ్ కీర్తి కేశవ్ బట్ కూడా సీజన్ సిక్స్ లో పోటీ పడుతూ ఉంది. దీంతో ఆమె ఇంస్టాగ్రామ్ లో సీజన్ సిక్స్ లో వెళ్తున్నట్లు తెలియజేయడంతో కార్తీక్ దీపం సీరియల్ అభిమానులు..బిగ్ బాస్ కి వచ్చావ్.. మరీ కార్తీకదీపం పరిస్థితి ఏంటీ? సీరియస్ ప్రశ్నలు.. వేస్తున్నారు.
Bigg Boss keerthi bhat:
మరికొంతమంది ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నారు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ప్రారంభంలో కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత తెలుగు సినిమా రంగంలో పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయింది. కార్తీకదీపం లో డాక్టర్ హేమ కార్తీక్ పాత్రతో.. ఎంతగానో ఆకట్టుకుంటున్న కీర్తి.. సీజన్ సిక్స్ లో పోటీకి దిగటం జరిగింది. మరి కీర్తి.. బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఏలా ఆడుతుందో చూడాలి. సీరియల్స్ లో నటించిన చాలామంది గత సీజన్ లలో గట్టిగానే… రాణించడం జరిగింది. మంచి పోటీ కూడా ఇచ్చారు. మరి కీర్తి కేశవ బట్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడలి.