Bigg Boss: రియాల్టీ షోల్లో ఫేమస్ అయిన బిగ్ బాస్ షోను అన్ని భాషల్లోనూ నడిపిస్తున్నారు. దీనికి ఉన్న క్రేజ్ గురించి షోను ఫాలో అయ్యే వారికి బాగా తెలుసు. నటీనటులు తమ నటనా సామర్థ్యాలను నిరూపించుకోవడానికి, గేమ్ స్పిరిట్ చాటుకోవడానికి బిగ్ బాస్ షో వేదికగా నిలుస్తోంది. అయితే, కాంట్రవర్సీలు కూడా ఇందులో చోటు చేసుకుంటున్నాయి. ఈ షోను బ్యాన్ చేయాలంటూ పలువురు డిమాండ్లు కూడా చేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ షో వ్యవహారంలో ఇదే జరుగుతోంది.
హిందీ బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా ఫేమస్. అక్కడ 15 సీజన్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. అయితే, ఈ సీజన్ లో డైరెక్టర్ సాజిద్ ఖాన్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. గతంలో ఆయనపై మీటూ అంటూ పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను బిగ్ బాస్ షోలోకి ఎలా తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోల నుంచి తరిమేయాలంటున్నారు. ఇటీవల నటి షెర్లిన్ చోప్రా దీనిపై సంచనల విషయాలు బయటపెట్టారు. తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.
Bigg Boss:
ఓసారి సాజిద్ తన ప్రైవేట్ పార్టుని చూపించి దానికి 10కి ఎంత రేటింగ్ ఇస్తావంటూ చాలా చీప్ గా ప్రవర్తించాడని బాంబు పేల్చింది. ఇప్పుడు తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి దానికి రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నానంటూ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. సల్మాన్ ఈ విషయంలో జోక్యం చేసుకొని సాజిద్ ను వెంటనే బయటకు పంపేయాలని డిమాండ్ చేసింది. షెర్లిన్ చోప్రాతో పాటు మందనా కరిమి, సోనా మహాపాత్ర, ఉర్ఫీ జావేద్, నేహా భాసిన్ తదితరులు కూడా సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ నుంచి పంపేయాలని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.