Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ బాలాదిత్యకి మిగతా ఇంటి సభ్యులు మంచి గౌరవం ఇస్తున్న సంగతి తెలిసిందే. మనోడు కూడా హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి.. బిగ్ బాస్ కి పెద్దరాయుడు మాదిరిగా ఆడుతున్నాడు. ప్రతి ఒక్క విషయంలో బాధ్యత తీసుకుంటూ కొద్దిగా అతి చేస్తున్నట్లు మనోడు ఆట తీరుపై బయట టాక్. సీజన్ సిక్స్ మొట్టమొదటి కెప్టెన్ గా బాలాదిత్య సెలెక్ట్ కావడం తెలిసిందే. ఈ క్రమంలో రెండో వారం కెప్టెన్సీ టాస్క్ లో బాలాదిత్య వ్యవహరించిన తీరుపై బయట విమర్శలు వస్తున్నాయి. రూల్స్ బుక్ లో… సరిగ్గా రూల్స్ చదవకుండా, తన సొంత నిర్ణయాలతో.. గేమ్ చెడగొట్టడం మాత్రమే కాదు మిగతా కంటెస్టెంట్లు ఆట తీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యేలా చేస్తున్నాడని ఆడియెన్స్ అంటున్నారు.

“సిసింద్రీ టాస్క్” లో భాగంగా చాలెంజింగ్ టాస్క్ లో… బేబీ విషయంలో రేవంత్, అభినయశ్రీ, శ్రీసత్య నిర్లక్ష్యంగా.. అజాగ్రత్తగా వ్యవహరించడంతో.. వాళ్ల బొమ్మలను..రూల్ ప్రకారం “లాస్ట్ అండ్ ఫౌండ్” జోన్ లో గీతు వేయడం జరిగింది. ఈ క్రమంలో అభినయశ్రీ బొమ్మ విషయంలో కొద్దిగా డిస్కషన్ జరిగిన క్రమంలో.. “లాస్ట్ అండ్ ఫౌండ్” లో ఉన్న అభినయశ్రీ బొమ్మని కెప్టెన్ గా బాలాదిత్యా వెనక్కి తీసుకొస్తాడు.

అభినయశ్రీ అజాగ్రత్తగా పెట్టలేదు. గీతు … ఆడిన గేమ్ రాంగ్ అంటూ సొంత లాడ్జిక్ లు చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంలో బిగ్ బాస్.. “లాస్ట్ అండ్ ఫౌండ్” లో తిరిగి అభినయశ్రీ బొమ్మ వేసేయాలని చెప్పటం బాలదిత్య కి షాక్ ఇచ్చినట్లయింది. దీంతో బాలదిత్య చాలా సందర్భాలలో అనవసరమైన వాగ్వాదానికి దిగటం..టైం వేస్ట్ చేసే రీతిలో వ్యవహరిస్తున్నట్లు బయట గట్టిగ టాక్ వస్తోంది.