Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శ్రీహన్ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా ఫిజికల్ టాస్క్ లో ఆడిన సందర్భాలు ఒకటి కూడా లేవని అంటున్నారు. ఇక ఇదే సమయంలో డిస్కషన్ టైం లో కూడా శ్రీహాన్ ఓపెన్ కాలేకపోతున్నాడని.. సేఫ్ గేమ్ ఆడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. శ్రీహాన్ మీద సీజన్ ఫైవ్ అతని లవర్ సిరి ఆట అద్భుతంగా ఉందని పోలుస్తూ విమర్శలు చేస్తున్నారు.
సీజన్ ఫైవ్ లో… సిరి లేడీ ఫైటర్ గా.. హౌస్ లో ఉన్న అందరి చేత శభాష్ అనిపించుకుంది. అంతేకాదు టాప్ 5 కంటెస్టెంట్ గా కూడా స్థానం సంపాదించుకుంది. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో పాయింట్ టూ పాయింట్ మాట్లాడటంలో.. ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా సిరి ఎంతగానో ఆకట్టుకుంది. ఏది ఉన్న ముఖంపై చెప్పేస్తు ఎక్కడా కూడా సేఫ్ గేమ్ ఆడకుండా.. దూకుడుగా ఆడింది. టాస్క్ లలో అపోజిషన్ లో బలమైన మగవాళ్ళు ఉన్నాగాని దూసుకుపోయేది.
కానీ శ్రీహన్ ఆటతీరు మొదటివారం అయిపోయి రెండవ వారం చివరికి వస్తున్న గాని… ఏ మార్పు లేకుండా పోయిందని కామెంట్లు చేస్తున్నారు. సిసింద్రీ టాస్క్ లో అర్జున్ బేబీని దొంగలించడం మినహా హౌస్ లో శ్రీహాన్ ఇప్పటివరకు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయాడని.. అంటున్నారు. ఈ రీతిగానే గేమ్ ఆడితే త్వరగానే శ్రీహన్ హౌస్ నుండి వచ్చేయడం గ్యారెంటీ అని విశ్లేషిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో శ్రీహన్ ఆటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి.