Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమయ్యింది. బలమైన కంటెండర్‌గా పేరు తెచ్చుకున్న గలాటా గీతు ఎలిమేషన్‌కు అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది. మోస్ట్ ఇరిటేకింగ్, లూప్ కంటెస్టెంట్ అని పిలిచే గలాటా గీతు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. మొదటి నుంచి గీతు యాటిట్యూడ్ అంటే చాలా మందికి నచ్చదు. అయితే తను మాత్రం గేమ్ భలేగా ఆడుతూ టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఎలిమినేషన్ అవడం దాదాపుగా ఖాయమైందని సమాచారం.
‘నువ్వు ఏడ్చే రోజు అతి దగ్గరలో ఉంది. రెండు కళ్ల వెంట నీళ్లొస్తాయి చూడు. అప్పుడు తెలుస్తుంది నేను కొట్టిన దెబ్బ ఏంటో’ అని ఆదిరెడ్డి గీతూకు వార్నింగ్ ఇచ్చారు. గీతు ఎలిమినేషన్ గురించే ఆదిరెడ్డి ఇలా అన్నాడని అర్థమవుతోంది. కానీ గీతు ఎలిమినేట్ కావడమేంటని ఆమె అభిమానులు అంటున్నారు. నామినేషన్స్‌లో 10 మంది ఉండగా గీతూనే దొరికిందా.. అసలు గీతు లేకపోతే బిగ్ బాస్ సీజన్ 6 లేదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
గీతు ఎలిమినేషన్‌కు అంతా రెడీ?
బిగ్ బాస్ హౌజ్ నుంచి గత వారం ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అంతకుమించి అన్నట్టుగా ఈ వారంలో ఊహించని ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ తాను గెలిచేశానని, విన్నర్ తానేనని.. శ్రీహాన్ రన్నర్ అని భ్రమల్లో ఉన్న గీతూకు ఊహించని షాక్ ఇస్తూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపినట్లు సమాచారం.
Bigg Boss 6:
ఇకపోతే, ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్‌లో మొత్తం 10 మంది ఉన్నారు. రేవంత్, ఇనయ, కీర్తి, బాలాదిత్య, ఆదిరెడ్డి, గీతు, రోహిత్, ఫైమా, మెరీనా, శ్రీసత్య ఈ పది మంది నామినేషన్‌లో ఉండగా.. వీరిలో గలాటా గీతూకు తక్కువ ఓటింగ్ రావడంతో ఆమెను ఎలిమినేట్ చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే వార్త ముందే బయటకు వచ్చింది.