Big Boss 6: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఆసక్తికరంగా నిర్వహించేందుకు ఆపసోపాలు పడుతున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా పలు వింత నిర్ణయాలు తీసుకుంటూ ఎలాగైనా షోను రక్తి కట్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. గేట్లు ఎత్తివేయడం, ఊహించని విధంగా ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేసేయడం, విజేతకు రావాల్సిన ప్రైజ్ మనీలో కోత విధించడం లాంటివి చేస్తున్నాడు బిగ్ బాస్.
ఇక బిగ్ బాస్ షో 11వ వారం ముగింపు దశకు చేరుకుంది. ఎలిమినేషన్లలో సరికొత్త ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఎవరూ ఊహించని వారిని ఎలిమినేట్ చేస్తూ ఆసక్తికరంగా మార్చాలని సర్వ విధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈసారి ఈ వంతు మెరీనాకు వచ్చింది. ఆమెను ఎలిమినేట్ చేయడానికి పలు కారణాలు కనబడుతున్నాయి. మెరీనా తన భర్త రోహిత్‌తో కలిసి బిగ్‌బాస్ సిక్త్ సీజన్‌లో అడుగుపెట్టింది. అయితే తొలుత వీరిద్దరినీ ఒకే కంటెస్టెంట్‌గా పరిగణణలోకి తీసుకున్నారు.
అనంతరం ఇద్దరినీ విడదీశారు. ఎవరి ఆట వాళ్లు ఆడాలంటూ సూచించారు. అయితే గేమ్‌లో ఒకరిని మరొకరు సపోర్ట్ చేసుకోవడం వల్ల మిగతావాళ్లు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విడిగా ఆడమన్నా కలిసే ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. చివరికి విడిగా ఆడాల్సి వచ్చింది. కానీ అప్పటికే సమయం దాటిపోయింది. రోహిత్ తన మాటలతో, ఆటతో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
Big Boss 6: మెరీనా మరీ ఇంతలానా..?
మరోవైపు మెరీనా మాత్రం మదర్ ఇండియాలా అందరికీ వంటలు చేస్తూ వచ్చింది. స్నేహంగా, నవ్వుతూ అందర్నీ పలకరించేది. ఎవరితోనూ రాద్దాతం పెట్టుకోలేదు. అదే ఆమె పాలిట పెద్ద శాపంగా మారిందంటున్నారు. బిగ్‌బాస్ హౌస్ అన్నాక కంటెస్టెంట్ యాక్టివ్‌గా ఉండక తప్పదు. గొడవలు సృష్టించాలి. టాస్కుల్లో పోటీ పడాలి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ నిరంతరం పోటీతత్వం అలవర్చుకోవాలి. వీటిలో ఆమె ఏ అంశంలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఇలాంటి ఐదు అంశాల్లో ఆమె వెనుకబడింది. షో రేటింగ్స్‌కు ఏమాత్రం ఉపయోగపడరని భావించిన బిగ్ బాస్.. ఇలాంటి వారిని ఎలిమినేట్ చేస్తున్నాడు.