Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గురువారం ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమో రిలీజ్ అయింది. ఈ టాస్క్ లో ముందుగా కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి ఇనయ చదివి వినిపిస్తుంది. ఇంటి సభ్యులకు ఇస్తున్న చివరి కెప్టెన్సీ టాస్క్ గ్రాఫాన్ రబి అని ఇనయ చెప్తుంది. వెంటనే గేమ్ స్టార్ట్ అయిన విజువల్స్ చూపిస్తారు. గార్డెన్ ఏరియాలో ఓ రౌండ్ సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ మధ్యలో బాల్ ఉంటుంది.
బజర్ మోగగానే అందరూ ఆ బాల్ ని తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అందరూ ప్రయత్నించగా రాజ్ ఆ బాల్ ని తీసుకుని పరిగెత్తి రేవంత్ కి విసురుతాడు. రేవంత్ ఆ బాల్ ని తీసుకుని ఎవరికి దొరకకుండా పరిగెత్తి విసురుతాడు అది శ్రీహాన్ కి దొరుకుతుంది. అప్పుడు అందరూ శ్రీహాన్ నుండి లాక్కునేందుకు ప్రయత్నిస్తారు. మీరు ఎందుకు క్యాచ్ లు వేసుకుంటున్నారు బాల్ ని లాక్కోవాలని ఫైమా అంటుంది.

ఒకరిపై ఒకరు పడటంతో గేమ్ లో ఏదో జరిగినట్లు ఉంది. అందుకే రేవంత్ కావాలని ఎవరు చేయరురా అని అంటాడు. కావాలని ఎవరూ చేయరురా ప్రెసర్ ఎక్కువ పడుతుందని చెప్తున్నా అని శ్రీహాన్ అంటాడు. అన్నిసార్లు ఒకటే కాదు వినాలి ఇంకోసైడ్ కూడా చూడాలి అని అక్కడి నుండి లేచి వెళ్లిపోతాడు రేవంత్.. నీ చేయి స్ట్రాంగ్ రా తగులుతుంది అని శ్రీహాన్ అంటాడు. సొంత వైద్యాలు వద్దు ఇక్కడ అని శ్రీహాన్ అంటే.. సొంత వైద్యం ఎవరు చేయలేదు చూడు అక్కడ ఫస్ట్… చూడకుండా మాట్లాడకు చెప్తున్నా అని రేవంత్ గట్టిగా శ్రీహాన్ మీద అరుస్తాడు.
మరలా గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు బాల్ ని ఆదిరెడ్డి, శ్రీహాన్ తీసుకుని పరిగెత్తుతున్నట్లు చూపిస్తారు. ఈ క్రమంలో ఈ టాస్క్ లో గెలిచి కెప్టెన్ అయిన వారు నేరుగా సెమిఫైనల్ వీక్ లోకి వెళ్తారు అంటే ఫైనల్ కి ఒక్క అడుగు దూరం మాత్రమే అని ఫైమా బిగ్ బాస్ ఆదేశాలను చిదివి వినిపిస్తున్నది చూపిస్తారు. తర్వాత ఆదిరెడ్డి తన చేతిలో బాల్ ని పట్టుకుని గట్టిగా అరుస్తాడు. అంతటితో ప్రోమో ముగుస్తుంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే సాయంత్రం ఎపిసోడ్ చూడాల్సిందే.