Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఈ శనివారం ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమో రిలీజ్ అయింది. ముందుగా ప్రోమోలో కొత్త హౌస్ కెప్టెన్ శ్రీసత్యకు నాగార్జున శుభాకాంక్షలు చెప్తాడు. ఇప్పుడు నీవు కెప్టెన్ గా అయింది బ్యాడ్ గా ఆడినా.. గుడ్ గా ఆడినా అని నాగార్జున ప్రశ్నిస్తాడు. మా పరంగా గుడ్ గానే సార్ అని శ్రీసత్య సమాధానం చెప్పగా.. ఎవరి పరంగా బ్యాడ్ అని నాగార్జున ఎదురు ప్రశ్న వేస్తాడు.
ఎక్స్ కెప్టెన్ శ్రీహాన్ ని నిలబెట్టి.. నీ కెప్టెన్సీలో ఏం పొడిచావ్ నాయనా అని నాగార్జున శ్రీహన్ ని ప్రశ్నిస్తాడు. తర్వాత ఓ వీడియో చూపిస్తాడు నాగ్. అందులో గీతూ పనులను ఆదిరెడ్డి చేస్తూ ఉంటుంది. ఇది చూసిన అప్పటి కెప్టెన్ శ్రీహాన్… బేబి సెట్టర్ ఏమైనా తెచ్చి ఇవ్వనా అందులో ఊగుతూ ఉందువు ఆదిరెడ్డి పని చేస్తా ఉంటాడు… నన్ను ఏమైనా అనాలి నరికేస్తా నిన్ను అని అంటాడు.

నీవు చెప్పింది ఏంటి శ్రీహాన్ అని నాగ్ ప్రశ్నిస్తాడు. ఎవరి హెల్ప్ లేకుండా వాష్ రూమ్స్ క్లీన్ చేపిస్తా అని చెప్పాను సార్ అంటాడు శ్రీహాన్. అక్కడ జరిగింది ఏంటని మరలా నాగ్ ప్రశ్నా వేస్తాడు. ఆదిరెడ్డి గారి హెల్ప్ తీసుకుంది అని శ్రీహాన్ సమాధానం ఇస్తాడు. పనిష్మెంట్ ఎందుకు తగ్గించావ్.. గీతూ వలన కెప్టెన్ అయినందుకా అని నాగార్జున అంటాడు.
వాష్ రూమ్స్ క్లీనింగ్ కి సంబంధించి గీతూ సమాధానమిస్తుంది. నీవు అనుకున్నది పనిష్మెంట్ కాదు.. ఆట కూడా నీవు అనుకున్నదే ఆడుతున్నావు గీతూ..ఐ నో గీతూ యూవ్ ఆర్ మ్యానిప్యూలేటర్ అండ్ యూ మ్యానిప్యూలేటెడ్… ఏదో నరికేస్తాను అన్నావు.. ఏదో నరుకు అని చెప్పిన నాగ్.. నీవు క్యాపెన్సీ కంటెండర్ కాకుండా నేను నరకుతున్నాను.. బిగ్ బాస్ వచ్చే వారంలో కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు అవకాశం ఇవ్వద్దని నాగార్జున చెప్తాడు. ఇక గేమ్ హార్స్ గా ఆడుతున్నందుకు రేవంత్ తీరుపై నాగార్జున సీరియస్ అవుతాడు అంతటితో సెకండ్ ప్రోమో ముగుస్తుంది.