Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించి రెండవ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ముందుగా మీ ప్లాస్మా మీద ఓ చైల్డ్ హుడ్ ఫోటో కనిపిస్తుంది.. బిగ్ బాస్ క్లూ అని నాగార్జున చెప్తాడు. ముందుగా స్క్రీన్ మీద ఓ ఫోటో కనిపిస్తుంది. దీంతో చెప్పడానికి రెడీగా ఉన్న శ్రీహాన్, రేవంత్ ఇద్దరిలో రేవంత్ అక్కడ ఉన్న గంట కొట్టి శ్రీసత్య సార్ అని చెప్తాడు. రాంగ్ అని నాగ్ చెప్పేస్తాడు. తప్పు చెప్పినందుకు నాలిక బయటపెట్టి ఒక తెలుగు పాట పాడాలని రేవంత్ కి నాగ్ పనిష్మెంట్ ఇస్తాడు. దీంతో తన నాలుకనుతన చేతితో పట్టుకుని రేవంత్ పాట పాడటానికి ట్రై చేస్తాడు.
తర్వాత మరో ఫోటో డిస్ ప్లే చేస్తారు. అప్పుడు గంట కొట్టి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఫైమా ఇమిటేషన్ బాగా చేస్తావా అని నాగ్ అడుగుతాడు. దీంతో రేవంత్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఫైమా చేసి చూపిస్తుంది. బాగా చేశావ్ ఫైమా అని నాగార్జున మెచ్చుకుంటాడు. ఇక వాసంతి పనిష్మెంట్ ఏంటంటే గోడ కుర్చీ వేసి ఎనిమిదవ ఎక్కం చెప్పమని నాగ్ చెప్తాడు.

దీంతో గోడ కుర్చీ వేసిన వాసంతి ఎనిమిదవ ఎక్కం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ తప్పుగా చెప్తుంది. ఇక మరో ఫోటో చూపిస్తారు. కీర్తి గంట కొట్టి రేవంత్ అన్నా అని చెప్తుంది. అప్పుడు కూడా రాంగ్ అని చెప్పి నీవు చెప్పు ఇనయ అని నాగ్ అడుగుతాడు. రాజ్ సార్ అని ఇనయ చెప్తుంది. అప్పుడు కూడా రాంగ్ అని చెప్పిన నాగార్జున ఇనయకు పనిష్మెంట్ ఇస్తాడు. కోడి లాగా జంప్ చేస్తూ పాట పాడాలని చెప్తాడు.
దీంతో ఇనయ జంప్ చేస్తుంది. పాట ఎక్కడ ఇనయ అని నాగార్జున ఫన్ చేస్తాడు. అప్పుడు హ్యాపి బర్త్ డే టు యూ అంటూ జంప్ చేస్తూ ఇనయ పాట పాడుతుంది. ఇక నామినేషన్స్ ప్రక్రియలో చివరగా వాసంతి, మెరీనా మిగిలినట్లు అర్ధం అవుతుంది. వారిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది ఓ వాటర్ గాజు కుండీలో మీ చేతిలో ఉన్న ఫ్లవర్స్ ముంచాలి.. ఎవరు ఫ్లవర్ రెడ్ గా మారితే వారు ఎలిమినేట్ అని వాసంతి, మెరీనాకు నాగార్జున చెప్తాడు. దీంతో వారిద్దరూ అందులో ఫ్లవర్ ముంచుతారు.. యు ఆర్ ఎలిమినేటెడ్ అని నాగ్ ప్రకటిస్తాడు అంతటితో ప్రోమో ముగుస్తుంది కానీ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది మాత్రం ప్రోమోలో చూపించరు.