Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ప్యామిలీ వీక్ కొనసాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించి మొదటి ప్రోమో లో ముందుగా ఫైమా వాళ్ల అమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అవుతుంది. దీంతో ఫైమా హ్యాపీగా వాళ్ల అమ్మను రిసీవ్ చేసుకుంటుంది. అందరూ హే ఫైమా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నీవు ఇంగ్లీషు అందరికీ నేర్పిస్తున్నావు నాకు నేర్పించవా అని ఫైమాను వాళ్ల అమ్మ అడుగుతుంది.
తర్వాత ఆంటీ నేను నేర్పిస్తా ఫస్ట్ అని శ్రీసత్య అనగానే నేర్పించు అని ఫైమా వాళ్ల అమ్మ అంటుంది. వెంటనే ఐ లవ్ యూ అని శ్రీసత్య అనడంతో ఫైమా అమ్మ ఆ అని నోరు వెల్లబోస్తుంది. దీంతో అందరూ నవ్వుతారు. ఫైమా కాకుండా నీ ఫేవరెట్ ఎవరో చెప్పండి అని శ్రీసత్య అడుగుతుంది. అందరూ నా ఫెవరెట్ అని ఫైమా అమ్మ అంటుంది. నీవు నన్ను చూస్తే నాకు భయమేస్తోందని అని రేవంత్ గురించి అంటుంది. దీంతో ఈ వారం మీరు ఇక్కడ ఉండి ఉంటే రేవంత్ నిన్ను నామినేట్ చేసి ఉండే వాడు అని శ్రీహాన్ అంటాడు.

అందరూ ఫైమా అమ్మతో కాసేపు ఫన్ చేస్తారు. గార్డెన్ ఏరియాలో అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. కానీ శ్రీసత్య మాత్రం పేరెంట్స్ గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అంతలోనే శ్రీసత్య అమ్మ, నాన్న వస్తారు. ఆనందం తట్టుకోలేక శ్రీసత్య ఏడ్చేస్తుంది. తర్వాత అందరూ కలిసి వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు. నన్ను ఫస్ట్ వీక్ నామినేషన్ ఎందుకు వేశారో అని శ్రీసత్య చెప్పబోతుంది. నీవు కూడా పిచ్చి పిచ్చిగా నామినేషన్స్ వేస్తున్నావు అంటూ వేస్తున్నావని శ్రీసత్యను వాళ్ల డాడి అంటాడు.
దీంతో శ్రీసత్య మొహం అదోలా పెడుతుంది. రేవంత్ తో పాటు మరి కొందరు హౌస్ మెంట్స్ అందరూ అవును అన్నట్లుగా రియాక్షన్ ఇస్తారు. ఇంతలోనే వాళ్లు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోవడంతో ప్రోమో ముగుస్తుంది. మొత్తానికి ఫైమా, శ్రీసత్య ఫ్యామిలీ రాకతో వీళ్లిద్దరూ ఫుల్ హ్యాపీగా గడిపారు. మరి పూర్తి ఎపిసోడ్ చూడాలంటే రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే..!