Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమో లో ముందుగా టాస్క్ లో భాగంగా రాజ్ సింగింగ్ టీచర్ గా ఎంట్రీ ఇస్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అందరూ కామెడీ చేస్తారు. నీకు వచ్చిన ఓ పాట పాడు అని ఫైమాను రాజ్ అడగుతాడు. పిల్లా అని ఫైమా స్టార్ట్ చేస్తుంది. దీంతో పిల్లా కాదు పిల్లా అని పాడాలి.. నీ పిచ్చి పైకి పోతుందని రాజ్ ఫైమాను అంటాడు. పిచ్చు కాదని పిచ్ అంటారు దాన్ని అని ఫైమా పంచ్ వేయడంతో హౌస్ లో అందరూ గట్టిగా నవ్వుతారు.
తర్వాత శ్రీహాన్ తో కలిసి లాలి లాలి లాలి వసతప్ర సాయికి వరహాల లాలి అని రాజ్ సాంగ్ పాడిస్తాడు. వసపత్ర కాదు వటపత్ర సాయికి అని రేవంత్ తప్పును సరిచేస్తాడు. నీవు నాకే చెప్తున్నావా అని రాజ్ రేవంత్ మీద సెటైర్ వేస్తాడు. మధ్యలో అరే ఆగు.. ఆగు నీవు అంటూ పక్కనే ఉన్న శ్రీహాన్ రాజ్ ని ఇమిటేషన్ చేస్తాడు. ఇంతలో ఓ బజర్ మోగుతుంది. నన్ని అని ఓ లెటర్ వస్తుంది.

నన్ని అని నిన్ను పిలుస్తారు కదా అని ఇనయ రోహిత్ ను అంటుంది. దీంతో ఇంతలో రోహిత్ మమ్మి.. రోహిత్ డాడీ అని గేట్ వైపు ఎవరైనా వచ్చారేమో అని శ్రీసత్య పిలుస్తుంది. ఇంటి సభ్యులు అందరూ ఫ్రీజ్ అని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. అందరూ ఫ్రీజ్ అవుతారు. హౌస్ లోపల నుండి రోహిత్ మమ్మి వస్తుంది. వెనక నుండి ఎవరో వస్తున్నారని రాజ్ గుర్తు పడతాడు.
రోహిత్ వాళ్ల మమ్మి ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకుని గట్టిగా ముద్దులు పెట్టుకుంటారు. తర్వాత అందరూ కూర్చోని ఎప్పటిలాగే కబుర్లు చెప్పుకుంటారు. ఫైమాకు సంబంధించిన ఏదో జోక్ చెప్తుంది రోహిత్ వాళ్ల మమ్మి. ఆదిరెడ్డి టాస్క్ కూడా టాస్క్ మస్తు ఉంటుంది అని పొగుడుతుంది. తర్వాత అందరికీ ఏదో స్వీట్ తినిపిస్తుంది. తర్వాత డ్యాన్సులు వేయడంతో ప్రోమో ముగుస్తుంది.