Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈరోజు గురువారం ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమో రిలీజ్ అయింది. ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారులకు ఇస్తున్న టాస్క్ పేరు కెప్టెన్సీ ఈ యువర్ గోల్ అని బిగ్ బాస్ ఆదేశాలను ఆదిరెడ్డి చదవి వినిపిస్తాడు. ఇఫ్ యువర్ బ్యాడ్ ఐయాయ్ యువర్ డాడ్ అని గేమ్ లో రేవంత్ డైలాగ్ చూపిస్తారు. కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న సభ్యులు వారి వారి పోల్స్ మధ్యలోకి పెద్ద బాల్ రాకుండా గేమ్ ఆడుతూ ఉండటాన్ని చూపిస్తారు.
ఈ క్రమంలో ఆదిరెడ్డి గట్టిగా కొట్టావ్ గుర్తు పెట్టుకో అని రేవంత్ అంటాడు. ఆటలో ఇప్పుడు మజా వస్తోందని పోటీలో లేకుండా పక్కన కూర్చుని ఉన్న రాజ్ అంటాడు. గేమ్ ఆడుతున్న క్రమంలో రోహిత్ పోల్ లోకి బాల్ వెళ్లిపోతుంది. సందు లేకుండా గొందులో ఎట్టా తోయాలి బిగ్ బాస్ అని ఆదిరెడ్డి అంటాడు. బాల్ ని శ్రీహాన్ ని ఇచ్చేసి ఆదిరెడ్డిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు శ్రీహాన్. ఈ క్రమంలో రేవంత్ ఆ బాల్ ని తీసుకుని ఆదిరెడ్డి పోల్స్ లో వేసేందుకు ప్రయత్ని చేస్తాడు.

అప్పుడు శ్రీహాన్ నుండి తప్పించుకుని వచ్చి రేవంత్ బాల్ ని తన పోల్స్ మధ్య వేయకుండా అడ్డుకునే ప్రయత్నింలో ఆదిరెడ్డికి చేయికి ఏదో తగిలి గట్టిగా అరుస్తాడు. ఎట్టకేలకు బాల్ ని రేవంత్ ఆదిరెడ్డి కోర్టులో వేస్తాడు. దీంతో స్టార్టజీనా అంటూ రేవంత్ పై ఆదిరెడ్డి ఫైర్ అవుతాడు. మరలా గేమ్ స్టార్ట్ అవుతుంది. సంచాలక్ పట్టిన గేమ్ రూల్స్ గురించి రోహిత్ తో రేవంత్ కి మాట యుద్దం సాగుతుంది.
గాల్లోకి విసరవద్దని చెప్పారు కానీ బయటి నుండి విసరకూడదని చెప్పలేదు కదా అని శ్రీహాన్ అంటాడు. గేమ్ ఆడేటప్పుడు కొట్టుకోవడం కాదు.. ఫస్ట్ వినాలి అని ఫైమా ఇమిటేషన్ చేస్తూ సీరియస్ అవుతుంది. ఇదే ఎటకారం తగ్గించుకుంటే నీకు మంచిది.. నీకన్న ఎక్కువ చేస్తే ఏడుస్తావు అని రేవంత్ ఫైమా మీద ఫైర్ అవుతాడు.. అమ్మో భయం అవుతుంది మరి నీవు ఎటకారం చేస్తే అని ఫైమా తనదైన శైలిలో మ్యానరిజం చేస్తుంది.. దీంతో మొదటి ప్రోమో ముగుస్తుంది.