Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్ కి సంబంధించి మొదటి ప్రోమో శిరి ఎంట్రీతో మొదలౌతుంది. శ్రీహాన్ తో పాటు హౌస్ సభ్యులు అందరూ బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఫ్రీజ్ లో ఉంటారు. సిరి శ్రీహాన్ దగ్గరికి వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. శ్రీహన్ ఫ్రీజ్ లో ఉండి కన్ను కొడతాడు. సిరి శ్రీహాన్ ని ముద్దు పెట్టుకుని హగ్ చేసుకుంటుంది. ఈ సమయంలో బిగ్ బాస్ సిరి ఫ్రీజ్ అని చెప్తాడు.
పాత పరిచయాలు నీకు బిగ్ బాస్ కి అని శ్రీహాన్ అంటాడు. ఐలవ్ యూ బిగ్ బాస్ అని సిర అంటుంది. తర్వాత బిగ్ బాస్ ఫ్రీజ్ తీసేయడంతో ఇద్దరూ గట్టిగా కౌగిలించుకుంటారు. సిరిని ఏదో అన్నాడని రేవంత్.. శ్రీహాన్ మీద ఫిర్యాదు చేస్తాడు. ఆతర్వాత సిరి క్యూట్ గా ఉంటుందని చెప్పాను కదా అని శ్రీహాన్ అంటాడు. దీంతో నాకు చెప్పేలేదు శ్రీసత్యకు చెప్పావ్ అని సిరి అంటుంది. అందరూ నవ్వుతారు.

తర్వాత ఇనయ.. ఏంటి ఈ మధ్య మా వాడి మీద ఫోకస్ చేయడం లేదని సిరి అడుగుతుంది. పాపం శ్రీహాన్ ని ఏడిపిస్తా ఏం అనుకోకు అని శ్రీసత్య అంటుంది. లేదు అనుకుంటా ఏడిపించకు అని సిరి అనడంతో అందరూ గట్టిగా నవ్వుతారు.ఆ తరవాత శ్రీహాన్‌ని లోపలికి తీసుకుని వెళ్లిన సిరి.. ప్రియుడి పేరుని తన వీపుపై పచ్చబొట్టు పొడిపించుకున్నదాన్ని చూపించి సర్ ప్రైజ్ చేసింది. ఇంతలో శ్రీహాన్-సిరిల కొడుకు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి చిచ్చరపిడుగులా చెలరేగాడు. హౌస్‌లో ఒక్కో కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తిస్తారో.. ఎలా మాట్లాడతారో చెప్పి ఆకట్టుకున్నాడు.
రేవంత్.. ‘నా క్యారెక్టర్ ఇంతే నేను ఇలాగే ఉంటా’ అని అంటాడని.. ఆదిరెడ్డి.. ‘కవితా ఐ లవ్యూ’ అంటాడని.. చెప్పిన చైతూ.. నామినేషన్స్‌లో తన తండ్రి ఇనయతో గొడవపడినప్పుడు ఎలా అన్నాడో సేమ్ అలా దింపేశాడు.వాడు వీడు ఏంటి? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు’ అంటూ శ్రీహాన్.. ఇనయపై సీరియస్ అయిన సీన్‌ని చేసి చూపించాడు బుడతడు. మొత్తానికి శ్రీహాన్-సిరి జోడీ చాలా క్యూట్‌గా అనిపించింది. ఆ పిల్లోడు అయితే అదరగొట్టేశాడు. సిరిని శ్రీహాన్ ఎత్తుకుని తిప్పుతూ ఉండటంతో ప్రోమో ముగుస్తుంది.