Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ సంబంధించి రెండో ప్రోమోలో శ్రీసత్య ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. మేడం క్యారెక్టర్ తో వచ్చిన శ్రీసత్యను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతారు. మేడం మీ శారీ బావుందని ఇనయ అంటుంది. మీరు కూడా బావున్నారు మేడం అని రేవంత్ అంటాడు. మేకప్ అంటే అంటో మీరే చెప్పండి అని శ్రీసత్య తోటి హౌస్ మెంట్స్ ని టాస్క్ లో భాగంగా అడుగుతుంది. దీంతో మేకు అప్ లో ఉందనుకోండి మేకప్ అంటారు అంటూ రేవంత్ వెటకారంగా సమాధానం ఇస్తాడు. శ్రీసత్య చప్పట్లు కొడుతుంది.
తర్వాత ఓ కప్పును చేతిలో పట్టుకుని మేకప్ కప్పుతో వేస్తే మేకప్ అవుతుందని అని రాజ్ కూడా కామెడీ చేస్తాడు. అయ్య బాబోయ్ అంటూ అందరూ నవ్వుతారు. మేకప్ వేయాలంటే ఏం ఉండాలి అని మరలా శ్రీసత్య ప్రశ్న వేస్తుంది. మొహం ఉండాలి అని శ్రీహాన్ కామెడీ చేయడంతో అందరూ నవ్వుతారు. శ్రీహాన్ కి మేకప్ వేస్తూ క్లాస్ చెప్పడానికి శ్రీసత్య ప్రయత్నం చేసినట్లు ప్రోమో ద్వారా తెలుస్తుంది. ఆదిరెడ్డి, శ్రీసత్య కలిసి మేకప్ వేస్తారు.

ఓ సైడ్ నుండి లాలి లాలి అని సాంగ్ వినిపిస్తుంది. దీంతో రాజ్ వాళ్ల అమ్మ వచ్చినట్లు అందరూ గుర్తుపడతారు. అనుకున్నట్లుగానే బిగ్ బాస్ హౌస్ లోని రాజ్ అమ్మ వస్తుంది. దీంతో ఏడుస్తూ ఇద్దరూ కౌగిలించుకుంటారు. ఇక ఉండేది నాలుగు వారాలే టైటిల్ కొట్టుకుని రా అని రాజ్ కి వాళ్ల మమ్మి చెప్తుంది. తర్వాత అందరూ రాజ్ మమ్మితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు.
అందరి గేమ్ ఎలా ఉందో చెప్పు అని రాజ్ అడుగుతాడు. ఇక్కడ అందరూ మంచిగా ఆడుతున్నారు అని రాజ్ వాళ్ల మమ్మి చెప్తుంది. దీంతో మంచి పాయింట్ అది అని ఆదిరెడ్డి అభిప్రయపడతారు. ఇంతకు ముందు మా అమ్మగారు అని చెబుతాడు. ఇప్పుడు మీ అబ్బాయి రాజ్ అని బయట కూడా చెప్పుకుంటారు అని రేవంత్ అంటాడు. ఆల్ రెడీ ఇప్పుడే బయట నాతో ఫోటో తీసుకున్నారని రాజ్ అమ్మ చెప్తుంది. ఇంతలో ఉమారాణి మీరు బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమౌతుందని, ఇంటి సభ్యులందరూ ఫ్రీజ్ అని బిగ్ బాస్ ప్రకటించిన తర్వాత రాజ్ అమ్మ ఉమారాణి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లిపోవడంతో ప్రోమో ముగుస్తుంది.