Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. ముందుగా నాగార్జునతో మొదలౌతుంది. మొన్న జరిగిన చేపల చెరువు టాస్క్ లో నీ పార్టర్న్ గీతూ ఫిజికల్ టాస్క్ ఇవ్వండి గుద్ది పారేస్తాను అంది… మరి గుద్దిపారేసిందా అని ఆదిరెడ్డిని నాగార్జున అడుగుతాడు. పాడేసినాను సార్ అని గీతూ సమాధానం చెప్తుంది. నిన్ను అడగడం లేదు గీతూ అని నాగార్జున సీరియస్ అవుతాడు.
సార్ ఆడింది ఈ వీక్ అని ఆదిరెడ్డి సమాధానం ఇస్తాడు. మరి మీరే లీస్ట్ ఎందుకు ఉన్నారు గుద్ది పారేసి ఆడితే అని నాగ్ అంటాడు. నీవు గెలవడం కోసం కాదు.. .అవతల వాడి వీక్ నెస్ మీద దెబ్బ కొట్టాలని ట్రై చేశావని నాగార్జున్ ఫైర్ అవుతాడు. లాస్ట్ వీక్ లో పూలు ఎత్తే టాస్క్ లో ఎవరు పూలు ఎత్తలేదు సార్.. ఆ టాస్క్ లో నేను కావాలని రెచ్చగొట్టాను అందరూ గట్టిగా ఆడాలని అని గీతూ అంటుంది.

గేమ్ ఇంట్రస్టింగ్ గా చేయడం మా బిగ్ బాస్ చూసుకుంటాడు. ఎవరు ఆట వారు బాగా ఆడితే సీజన్ ఎక్కడా ఉండాలో అక్కడ ఉంటుందని నాగార్జున్ చెప్తాడు. నేను ఒక గేమర్ ని సార్ బయట కూడా అని గీతూ అంటే వారి వీక్నెస్ మీద ఆడుకుంటే గేమర్ కాదు… నీవు ఎవరు ఆటలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి, సంచాలక్ ఈ వన్ ఎంపైర్.. నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది… ఆ మాట బావుందా… బాగాలేదు కదా… కోపం వస్తే కామన్ సెన్స్ అన్ని ఉండవా అని నాగ్ కొప్పడతాడు.
సంచాలకురాలిగా ఉండి ఎంపైరింగ్ చేయకుండా గేమ్ ఆడినందుకు పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అని నాగార్జున చెప్తారు. దీంతో ప్రోమో ముగుస్తుంది. మొత్తానికి ఈ వీకెండ్ లో గీతూకి నాగార్జున గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మరి గీతూకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో అనే దానిపై ఇప్పుడ బిగ్ బాస్ ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ రోజు ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో…!