Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గురువారం ఎపిసోడ్ కి సంబంధించి మొదటి ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ముందుగా హలో వినిపిస్తుందా నేను మాట్లాడేది అని రేవంత్ భార్య వినిపిస్తుంది. వాయిస్ ఎక్కడి నుండి వస్తుందో అర్ధం కాక రేవంత్ హౌస్ లో అంతా పరిగెడుతాడు. ఎక్కడ బేబి అని రేవంత్ వెతుకున్న క్రమంలో హౌస్ లోని స్క్రాన్ మీద తన భార్య కనిపిస్తుంది. స్క్రీన్ ముందుకు వచ్చి కూర్చుంటాడు రేవంత్.
అసలు నీవు ఫస్ట్ ఎమోషనల్ అవ్వద్దు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావని రేవంత్ ను తన భార్య అంటుంది. నీ హెల్త్ ఎలా ఉంది చెప్పు అని రేవంత్ అడిగితే… ఎంత మంది ఉన్నా నీవు లేవన్న బాధ మాత్రం చాలా ఎక్కువ అని రేవంత్ భార్య చెప్పగానే స్క్రీన్ మీద కనెక్షన్ కట్ అవుతుంది. రేవంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కన్నీరు పెట్టుకుని మా ఆవిడతో మాట్లాడతా ప్లీజ్ బిగ్ బాస్ అని రేవంత్ రిక్వెస్ట్ చేస్తాడు.

తర్వాత హౌస్ లోకి రేవంత్ అమ్మ వస్తుంది. ఎమోషనల్ గా వాళ్లిద్దరు ఒకరిని ఒకరు కౌగిలించుకుంటారు. బాగా ఆడు టెన్షన్ పడకు అని రేవంత్ కు వాళ్ల అమ్మ చెప్తుంది. వాడు టెన్షన్ పడడు ఆంటి టెన్షన్ పెడతాడు అని శ్రీమాన్ అంటాడు. కోపం తగ్గించుకో అని రేవంత్ కి చెప్తుంది. లోపలికి వెళ్లి శ్రీహాన్, రేవంత్ ముగ్గురూ మాట్లాడతారు. నా కొడుకుకి మంచి ఫ్రెండ్ దొరికాడు అలాగే ఉండండి మీరు అని శ్రీహాన్ ని ఉద్దేశించి రేవంత్ వాళ్ల మమ్మి అంటుంది.
ఇక కీర్తిని దగ్గరికి పిల్చుకుని నేను ఉన్నాను మీ అమ్మగా..నీవు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు..నా కూతురులాంటి దానివి కాదు నా కూతురే..అని రేవంత్ వాళ్ల మమ్మి చెప్తుంది. ఇక రేవంత్ గడ్డం లైట్ గా తీసుకో అని చెప్పగానే ఒక్క నిమిషం ఉండు మొఖం కడుక్కుని వస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయి కాసేపటికే కోర మీసాలు మాత్రమే పెట్టుకుని గెడ్డం మొత్తం తీసేసి పరిగెత్తుకుంటూ రేవంత్ వస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు రేవంత్ గెటప్ చూసి ఇప్పుడు బావున్నావు అని రేవంత్ ని వాళ్ల అమ్మ ముద్దు పెట్టుకోవడంతో ప్రోమో ముగుస్తుంది.