Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ కి సంబంధించి రెండవ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ముందుగా టాస్క్ లో భాగంగా అమ్మాయిలను ఫ్లర్టింగ్ ఎలా చేయాలనే దానిపై శ్రీమాన్ టీచింగ్ చేయాల్సి ఉంటుంది. టాస్క్ స్టార్ట్ అవుతుంది. శ్రీమాన్ క్లాస్ కు రాగానే గుడ్ మార్నింగ్ ఫ్లర్టింగ్ సార్ అని రాజ్ కామెడీ చేస్తాడు. స్టూడెండ్స్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అందులో నీవు ఎవరిని ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నావు అని రాజ్ ని శ్రీహాన్ అడుగుతాడు.
నాకు ఏ అమ్మాయి అయినా పర్వాలేదు సార్ అని రాజ్ వేసిన పంచ్ కి హౌస్ మొత్తం గట్టిగా నవ్వుతారు. తర్వాత మనం పొగిడే పొగడ్తలకు అమ్మాయిలు ఇలా ఐస్ లా కరిగిపోవాలి అని డ్యాన్స్ చేస్తూ శ్రీహాన్ ఆదిరెడ్డికి చూపిస్తాడు. మనకు అది అలవాటు లేదని డ్యాన్స్ వేసి ఆదిరెడ్డి చూపిస్తాడు. తర్వాత ఫైమాను ఉద్దేశించి ఆదిరెడ్డి మాట్లాడుతూ.. దెబ్బ ఏమీ తగల్లేదా అని అంటే ఫైమా అందుకు ఎందుకు అని అడుగుతుంది. స్వర్గం నుండి కింద పడేటప్పుడు అని ఆదిరెడ్డి డైలాగ్ వేస్తాడు. దీంతో సిగ్గుతో పోరా అని ఫైమా అక్కడి నుండి వెళ్లిపోతుంది.

తర్వాత హౌస్ సభ్యులు అందరూ ఫ్రీజ్ లో ఉంటారు. బిగ్ బాస్ గేట్ లో నుండి ఏమండోయ్ భాను గారూ అంటూ కీర్తి ఫ్రెండ్ ఎవరో వస్తారు. ఇద్దరూ కలిసి గార్డెన్ ఏరియాలో డ్యాన్సులు వేస్తారు. కీర్తి ఫ్రెండ్ అందరితో సరదాగా కాసేపు మాట్లాడతాడు. కామెడీ స్పెల్లింగ్ చెప్పండి అని ఫైమాను అడుగుతాడు. ఫైమా కరెక్ట్ గానే చెప్తుంది. అక్కడ బాగా ఫన్ కొనసాగుతుంది.
తర్వాత కీర్తి ఫ్రెండ్ సీరియల్ మీరో పేరు ఆది ఊహించకుండా ఇనయతో ఇక్కడ ముద్దు పెడతావా…. ఇక్కడ ముద్దు పెడతావా అని అడుగతాడు. అందరూ అవాక్కవుతారు. తర్వాత ఆ దేవుడు నీకు ఆ దేవుడు నీ దగ్గర తీసేసుకున్నాడు…అదే దేవుడు నీకు మళ్లీ ఒక అవకాశం ఇచ్చాడు అదే బిగ్ బాస్ అని ఆది కీర్తికి చెప్తాడు. ఆ తర్వాత ఇనయ వాళ్ల మమ్మి హౌస్ లోకి రావడాన్ని చూపిస్తారు. గెలిచి ఇంటికి రావాలి ఎదురు చూస్తుంటానుని ఇనయకు వాళ్ల మమ్మి చెప్తుంది. వాళ్ల అమ్మవి ఇనయ గార్డెన్ ఏరియాలో కాళ్లు మొక్కడంతో ప్రోమో ముగుస్తుంది.