Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొత్తానికి బిగ్ బాస్ కోరిక నెరవేరింది. ఈ సీజన్ లో మొదటి వారం నుండి ఏదో ఒక జంటకు లవ్ ట్రాక్ నడిపించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాదాపు 4 వారాలకు పైగా వర్కవుట్ అవ్వలేదు. అందరూ చాలా జాగ్రత్తగా ఎవరికీ నష్టం జరగకూడదనే ఆలోచనతో ముందు చూపుతో గేమ్స్ ఆడుకుంటూ వచ్చారు
ముందుగా శ్రీసత్య, అర్జున్ మధ్యలో అందరూ లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుందేమో అని అనుకున్నారు. కానీ శ్రీసత్య ఆ అంచనాలకు బ్రేక్ వేశారు. తనకు ఇలాంటివి సరిపోవు అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా అర్జున్ కి క్లాస్ పీకుతూనే వస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా అర్జున్ మాత్రం తన తీరు మార్చుకోకుండా శ్రీసత్య కోసం బిగ్ బాస్ హౌస్ లో త్యాగాలు చేస్తూనే వస్తున్నాడు.

ఇక అంతకు ముందు ఆరోహి, సూర్య మధ్య ట్రాక్ కొన్నాళ్లు కొనసాగింది. ఇక ఈ జంట లవ్ ట్రాక్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఈ సారి సక్సెస్ అని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా నామినేషన్స్ లో ఉన్న ఆరోహి బిగ్ బాస్ హౌస్ లో నుండి ఎలిమినేట్ అవుతుంది. దీంతో ఒక్కసారిగా లవ్ ట్రాక్స్ అనేది హౌస్ లో వినిపించకుండా పోయింది.
ఇక కష్టమే అనుకున్న తరుణంలో ఇనయ లైన్ లోకి వచ్చి తనకు సూర్య అంటే క్రష్ అని బిగ్ బాస్ కు ఓపెన్ గా చెప్పేస్తుంది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య మామూలు కెమెస్ట్రీ నడవడం లేదు. సూర్య ఈ వీక్ కెప్టెన్ గా ఎంపిక అయ్యే క్రమంలో ఓటు తన బావకే వేస్తున్నా అని ఇనయ అనౌన్స్ చేస్తుంది. దీంతో హౌస్ లో టాస్క్ లో గెలిచిన సూర్య కెప్టెన్ గా ఎంపిక అవుతాడు. ఇక అప్పటి నుండి ఇనయ బిగ్ బాస్ హౌస్ లో ఓవరాక్షన్ మామూలుగా లేదండోయ్…!