Bigg Boss6: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం గురించి ఇప్పటికే ఎన్నో విమర్శలు వెళ్లుతాయి. గతంలో ఈ సీజన్ ప్రసారం కావడంతో ఈ కార్యక్రమం పై ఎన్నో విమర్శలు చేసిన సీపీఐ నారాయణ ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో రెడ్ లైట్ ఏరియాతో పోల్చారు.వందరోజుల పాటు అమ్మాయిలు అబ్బాయిలను ఒకే చోట పెడితే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినవాళ్లు పతివ్రతలు అంటే తాను నమ్మనంటూ ఈయన నోటికొచ్చినట్టు ఈ కార్యక్రమం గురించి మాట్లాడారు.
ఈ విధంగా నారాయణ బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పలువురు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఈయనపై పరోక్షంగా అటాక్ చేశారు. ఇదిలా ఉండగా సీజన్ సిక్స్ ప్రారంభమైన అనంతరం నారాయణ ఈ కార్యక్రమం గురించి ఇలాగే మాట్లాడటమే కాకుండా నటుడు నాగార్జునను సైతం దారుణంగా విమర్శలు చేశారు. ఇలా నారాయణ వ్యాఖ్యలు శృతిమించడంతో నాగార్జున పరోక్షంగా నారాయణ వ్యాఖ్యలపై స్పందించారు.
ఈ సీజన్లో బిగ్ బాస్ కార్యక్రమంలోకి మెరీనా రోహిత్ జంట వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇక హౌస్లో మెరీనా తన భర్త తనకు హాగ్ ఇవ్వలేదని ముందు కూడా పెట్టలేదని తెగ ఫీల్ అయింది.ఇలా ఈమె ఫీల్ కావడంతో శనివారం ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున మెరీనాకు టైట్ హాగ్ ఇవ్వమని నాగార్జున రోహిత్ కు చెప్పారు. దీంతో నాగార్జున మేరీనాకు టైట్ హాగ్ ఇవ్వడమే కాకుండా ముద్దు పెట్టాడు. దీంతో నాగార్జున నారాయణ నారాయణ మీకు లైసెన్స్ ఉంది అంటూ పరోక్షంగా నారాయణ పై కౌంటర్ వేశారు.
Bigg Boss6: పెళ్లయిన వారికి శోభనం గది పెళ్లి కాని వారి పరిస్థితి ఏంటి..
ఇలా పరోక్షంగా నాగార్జున పై కౌంటర్ వేయడంతో నారాయణ సైతం రివర్స్ కౌంటర్ వేశారు. పెళ్లయింది లైసెన్స్ ఉంది కదా అంటూ పెళ్లయిన జంటకు ప్రత్యేకంగా శోభనం గది ఏర్పాటు చేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి.. వాళ్లకు పెళ్లిళ్లు కాలేదు కదా వాళ్లు బంధువులే కాదు కదా మరి వాళ్లేమయ్యారు వందరోజుల పాటు వాళ్ళు ఏం చేస్తారు చెప్పయ్యా నాగయ్య అంటూ పరోక్షంగా నాగార్జున పై కౌంటర్ వేశారు.ఇలా వీరిద్దరూ ఒకరిపై మరొకరు పరోక్షంగా దాడి చేసుకోవడంతో నేటిజన్స్ బిగ్ బాస్ చూసేవాళ్ళకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లకి లేని బాధ ఈయనకెందుకు అంటూ పెద్ద ఎత్తున సీపీఐ నారాయణ పై మండిపడుతున్నారు.