Bigg Boss6: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ప్రస్తుతం మూడు వారాలను పూర్తిచేసుకుని నాలుగవ వారం కూడా పూర్తి కానుంది.ఇలా ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం నుంచి మొదటివారం మొదటి ఎలిమినేషన్ కంటెస్టెంట్ గా షాని హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా ఈయన ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అయినటువంటి షాని పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిగ్ బాస్ కార్యక్రమం పై తన అభిప్రాయాన్ని కంటెస్టెంట్ ల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా షానీ మాట్లాడుతూ ఆడియన్స్ ఓటింగ్ పరంగా అయితే తాను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదన్నట్టు మాట్లాడారు. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి ఈయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా గలాట గీతూ గురించి షానీ మాట్లాడుతూ హౌస్ లో ఉన్న వారిలో వేస్ట్ కంటెస్టెంట్ గీతూ అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
Bigg Boss6: ఒకరి పక్కన ఒకరు పడుకుంటే బ్రోతల్ హౌసా
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని అంటున్నారు. అలాగే సీపీఐ నేత నారాయణ ఇది బిగ్ బాస్ హౌస్ కాదు బ్రోతల్ హౌస్ అన్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా హౌస్ లో ఒకే బెడ్ పై ఒకరి పక్కన మరొకరు పడుకున్నంత మాత్రాన అది బ్రోతల్ హౌస్ కాదంటూ ఈయన నారాయణ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అయితే త్వరలోనే పూర్తి ఇంటర్వ్యూ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.