బిగ్ బాస్ రియాలిటీ షోకి ఇండియన్ వైడ్ గా ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది సెలబ్రెటీలకి బిగ్ బాస్ ఫేమ్ తీసుకొచ్చింది. అనామకులుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన వారు తరువాత సెలబ్రెటీలుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాగే వెటరన్ స్టార్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి మళ్ళీ మూవీలలో బిజీ అవుతున్నారు. తెలుగు బిగ్ బాస్ కూడా అలాంటి ఇమేజ్ ని చాలా మందికి అందించింది. సోషల్ మీడియాలో ఫేమ్ అయినవారిని కూడా తీసుకొచ్చి సెలబ్రెటీలుగా మార్చింది. అలాగే మోడలింగ్ లో ఉన్నవారికి కూడా మంచి ప్లాట్ఫార్మ్ అయ్యింది. అయితే బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచిన వారికి మాత్రం ఊహించినంత క్రేజ్ అయితే రాలేదు. సీజన్ అయిన తర్వాత కొద్ది రోజులు వారి హడావిడి నడిచిన తరువాత ఎవరూ పట్టించుకోవడం లేదు.
అంతో ఇంతో ఫేమ్ తెచ్చుకొని హీరోగా సక్సెస్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు నటుడు ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ సీజన్ 2లో విన్నర్ అయిన కౌశల్ మండాకి పాపులారిటీ బాగానే వచ్చిన ఆ స్థాయిలో సక్సెస్ మాత్రం ఎందుకనో రాలేదు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగుకి ప్రతి సీజన్ కి ప్రజల ఆసక్తి తగ్గుతూ వస్తుంది. ఈ విషయాన్ని ఆయా షోలకి వస్తున్న రేటింగ్స్ చూసుకుంటే తెలిసిపోతుంది. ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత హాట్ స్టార్ లో అయిపోయిన ఎపిసోడ్స్ ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్న బిగ్ బాస్ అభిమానులు టెలివిజన్ లో మాత్రం రాత్రి ప్రసారం అయ్యే షోని చూడటం లేదు. తాజాగా బిగ్ బాస్ సీజన్స్ వారీగా వచ్చిన రేటింగ్స్ చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 6కి అతి తక్కువ రేటింగ్ వచ్చింది. సీజన్ వన్ కి ఎన్ఠీఆర్ వ్యాఖ్యాతగా ఉండటంతో ఫస్ట్ ఎపిసోడ్ కి 16.18 రేటింగ్స్ వచ్చింది.
తరువాత సీజన్ 2 నాని వ్యాఖ్యాతగా చేయగా ఫస్ట్ ఎపిసోడ్ కి రేటింగ్ కాస్తా తగ్గి 15.05 వచ్చింది. అయితే నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు సీజన్స్ కి 17.9, 18.5, 15.71 రేటింగ్స్ వచ్చాయి. నిజానికి మొదటి రెండు సీజన్స్ తో పోల్చుకుంటే నాగార్జున హోస్ట్ గా చేసిన మూడు సీజన్స్ ఫస్ట్ ఎపిసోడ్స్ కి టాప్ రేటింగ్స్ వచ్చాయి. అయితే సీజన్ 6కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సారి దారుణమైన రేటింగ్స్ ని స్టార్ మాకి బిగ్ బాస్ ద్వారా వచ్చింది. ఈ సరి ఫస్ట్ ఎపిసోడ్ లో అంత జోష్ లేదనే మాట ముందు నుంచి వినిపిస్తుంది. దానికి తగ్గట్లుగానే రేటింగ్ అన్ని సీజన్స్ కంటే తక్కువగా బిగ్ బాస్ కెరియర్ లో డిజాస్టర్ గా 8.86 రేటింగ్ వచ్చింది. దీనిని బట్టి ఈ సీజన్ పై ప్రేక్షకులకి బిగ్ బాస్ మీద బాగా ఆసక్తి తగ్గిపోయిందని అర్ధమవుతుంది. మొదటి రోజే ఈ స్థాయిలో రేటింగ్ ఉంటే ఇక వంద రోజుల పాటు స్టార్ మా కి బిగ్ బాస్ భారీగా నెగిటివ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.