బిగ్ బాస్ సీజన్ 6 ఆట రసవత్తరంగా సాగుతుంది. ఎవరికి వారు తగ్గేదిలే అన్నట్లుగానే తమ తమ పరిధిలో గేమ్ అడుగుతున్నారు. ఈ సారి హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కంప్లీట్ గా బిగ్ బాస్ గేమ్ స్టైల్ ని అర్ధం చేసుకొని అడుగుపెట్టిన వారే. హౌస్ లో ఎలా ఉంటే ఆడియన్స్ కి రీచ్ అవుతామనేది కరెక్ట్ గా అంచనా వేసుకొని తమ ప్లేని షురూ చేశారు. ఈ కారణంగానే మొదటి వారం ఎలిమినేషన్ టైంలోనే కచ్చితమైన పాయింట్స్ పట్టుకొని తమకి నచ్చని వారిని ఎలిమినేట్ జోన్ లోకి నెట్టారు. మెజారిటీ కంటిస్టెంట్ లు సింగర్ రేవంత్ ని ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సింగర్ రేవంత్ కి బయట మంచి పాపులారిటీ ఉంది. ఇండియన్ ఐడల్ విన్నర్ కావడం వలన నార్త్ లో కూడా అతనికి మంచి ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎంత మంది అతన్ని నామినేట్ చేసిన కూడా ఈ వారం ఓటింగ్ పరంగా చూసుకుంటే అతనే ఫస్ట్ ప్లేస్ లో ఉండటం విశేషం.
అతని గేమ్ స్టైల్ కూడా కాస్తా ఎమోషనల్ టచ్ తో నడుస్తూ ఉండటంతో కంటిస్టెంట్ లు అందరూ అతన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అనే పాయింట్ లో ప్రేక్షకులకి ఫీలింగ్ వచ్చేసింది. ఈ నేపధ్యంలో అతనికి అత్యధిక ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం ఏడుగురు బాలాదిత్య, రేవంత్, ఫైమా, శ్రీ సత్య, ఇనాయా సుల్తానా, అభినయశ్రీ, చలాకీ చంటి నామినేట్ అయ్యారు. అయితే, క్లాస్‌లో ఉన్న సభ్యులు స్పెషల్ అధికారంతో బాలాదిత్యను అరోహీ రావ్ ని ఎలిమినేషన్ జోన్ లోకి తీసుకొచ్చేశారు.
ఇక ఓటింగ్ పరంగా రేవంత్ తర్వాత ఎక్కువగా జబర్దస్త్ ఫైమాకి ఓటింగ్ వచ్చింది. దీంతో వీరిద్దరూ ఈ వారం సేఫ్ అయినట్లే. అయితే ఈ ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్నది ఇనాయ సుల్తానా, ఆరోహి రావు. వీరిద్దరి మధ్య కాస్తా టఫ్ ఫైట్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇనాయ సుల్తానకి అంతగా ఫేమ్ లేకపోవడం అలాగే హౌస్ లో ఆమె ప్రతి చిన్న విషయానికి హర్ట్ కావడం, అలాగే ఆరోహి రావుకి ప్రతి సారి సెంటిమెంట్ వాయిస్ ని ఎక్కువగా వినిపిస్తూ సింపతీ గేమ్ ఆడుతున్నట్లు అనిపించడంతో ప్రేక్షకులకి వీరు రీచ్ కాలేదు. అయితే వీరిద్దరిలో ఇనాయ సుల్తానా ఈ సారి బయటకి వెళ్లిపోయే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. మరి ఏవైనా అద్భుతాలు జరిగితే ఆమె హౌస్ లో ఉండే అవకాశం ఉంది.