బిగ్ బాస్ సీజన్ 6లో ఎన్నడూ లేని విధంగా రెండు వారాల తర్వాత ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. ఈ ఫస్ట్ ఎలిమినేషన్ ని శనివారమే ఫైనల్ చేసేశారు. ఇక సెకండ్ ఎలిమినేషన్ ఆదివారం ఎపిసోడ్ లో ఖరారు చేయనున్నారు. ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని కింగ్ నాగార్జున ఇప్పటికే హోస్ట్ గా ఖరారు చేసి చెప్పేసారు. ఇక ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ గా షాని సోలొమన్ కావడం గమనార్హం. ఎంటర్టైనర్ గా హౌస్ లో ఎక్కువ రోజులు ఉంటాడని షాని సోలొమన్ విషయంలో చాలా మంది ప్రెడిక్ట్ చేశారు. అయితే హౌస్ లోకి వెళ్ళింది మొదలు అతని నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా దొరకలేదు.
అలాగే సరైన గేమ్ కూడా కనిపించలేదు. హౌస్ లోకి వచ్చి రెండు వారాలు అయినా కూడా ఇంకా మిగిలిన కంటిస్టెంట్ లతో కలవడంలో కూడా షాని చాలా వెనకే ఉన్నాడు. చలాకి చంటి కూడా ఎంటర్టైనర్ గానే హౌస్ లోకి వచ్చి మొదటి రోజు నుంచి తన స్టైల్ లో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. అలాగే గేమ్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఎక్కడ తగ్గకుండా టాప్ 5 కంటిస్టెంట్ లలో ఒకడుగా అనిపించుకున్నాడు. అయితే షాని విషయంలో ఆ రకమైన ఆటతీరు పూర్తిగా మిస్ అయ్యింది. పోనీ కనీసం ఇంట్లో వారితో గొడవ పడుతూ అయినా కంటెంట్ జెనరేట్ చేస్తున్నాడా అంటే అది కూడా జరగడం లేదు. తనని ఎవరైనా విమర్శించినా సీరియస్ కావడం లేదు. అలాగే అనవసరమైన గొడవలు తనకెందుకు అనే విధంగా ఇష్యూ నుంచి డైవర్ట్ అవుతున్నాడు.
దీంతో అతని మీద ఫోకస్ పూర్తిగా తగ్గిపోయింది. ఇక కంటెంట్ ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడని బిగ్ బాస్ నిర్వాహకులు కూడా భావించారు. అలాగే ఓటింగ్ పరంగా కూడా షాని అందరి కంటే లాస్ట్ లో ఉన్నాడని చెప్పాలి. ఇలా రెండు కారణాలతో బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ ఎలిమినేషన్ గా షాని సోలొమన్ ని బయటకి పంపించేశారు. ఇక బిగ్ బాస్ బజ్ లో కూడా షాని తన పంథా ఇదే అనే విధంగా మాట్లాడటం ద్వారా అతని ఆటతీరులో మార్పు ఉండదని చెప్పకనే చెప్పేసాడు. ఇక సెకండ్ ఎలిమినేషన్ జోన్ లో వరస్ట్ కంటిస్టెంట్ గా ఉన్న అభినయశ్రీ, అలాగే వాసంతి కృష్ణన్ ఉండటం విశేషం. మరి వీరిద్దరిలో ఎక్కువ మంది మాత్రం అభినయశ్రీనే వెళ్లిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. దానికి కారణం ఆమె కూడా పెద్దగా కంటెంట్ జెనరేట్ చేసే కంటిస్టెంట్ గా హౌస్ లో లేకపోవడమే అని చెప్పాలి.