Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ నేహా చౌదరి మంచి దూకుడు మీద గేమ్ ఆడుతూ ఉంది. ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆ రీతిగా మాట్లాడుతూ.. అందరిని ఆకట్టుకుంటూ రెండో రోజు.. ఫిజికల్ టాస్క్ లో గెలిచి మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నుండి తప్పించుకుంది. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా టాప్ మోస్ట్ న్యూస్ చానల్స్ లో యాంకర్ గా విజయవంతంగా రాణించి మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో పేరుగాంచిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి కూడా ఒకానొక సమయంలో నేహా చౌదరి యాంకరింగ్ చేయడం జరిగింది.
ఇంకా పలు క్రీడల ఈవెంట్లకు కూడా హోస్ట్ గా వర్క్ చేసింది. తిరుపతి నగరానికి చెందిన నేహా చౌదరి.. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో.. ఆ తర్వాత తల్లికి ప్రభుత్వ ఉద్యోగం రావటంతో కర్నూల్ ప్రాంతానికి షిఫ్ట్ అయి అక్కడే చదువు ముగించడం జరిగింది. యాంకర్ గా మాత్రమే కాదు చిన్ననాటి నుండి గేమ్స్ లో ఛాంపియన్ కావటం తో పాటు స్విమ్మర్, జిమ్ ట్రైనర్, యోగా ట్రైనర్ గా కూడా రాణించింది. ఇంకా మోడలింగ్ లో రాణించింది. ఆ తర్వాత గూగుల్ లో పనిచేసిన అనుభవం నేహా చౌదరికి సొంతం.
నేహా చౌదరి చాలా వరకు మోడలింగ్ రంగంలో రాణించడానికి తాను సంపాదించే దానిలో అధిక మొత్తం ఖర్చు చేస్తూ ఉంటది. ఈ పరిణామంతో బంగారం అధికంగా కొనటంతో పాటు రకరకాల దుస్తులు కూడా కొనడంతో మొత్తం ఆమె దగ్గర 40 కేజీల జువెలరీ.. తో పాటు 20 బీరువాలు బట్టలు 200 జతలు చెప్పులు.. ఉన్నాయని ఇదే తన ఆస్తి అని ఇటీవల ఆమె బయోడేటా గురించి ఓ ఇంటర్వ్యూలో.. తెలియజేయడం జరిగింది.