Bigg Boss6: బుల్లితెర పై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం రెండవ వారం పూర్తిచేసుకుని మూడవ వారం కూడా పూర్తి కానుంది.ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇద్దరూ కంటెంట్లను బయటకు పంపించగా తాజాగా మూడవ వారంలో భాగంగా వాసంతి, ఆరోహి, ఇనాయ, బాలాదిత్య, చలాకి చంటి, నేహా, రేవంత్, శ్రీహాన్ గీతూ రాయల్ నామినేషన్ లో ఉన్నారు.
ఇలా ఈ వారం నామినేషన్ లో ఉన్నటువంటి వీళ్లలో ఎవరో ఒకరు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకోవడం కోసం నామినేషన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున టాస్కలలో పోటీ పడుతూ ఓట్లు సంపాదించుకోవడానికి కృషి చేస్తున్నారు.అలాగే మరోవైపు ఎలిమినేషన్ లో ఉన్నటువంటి వారిని సేవ్ చేయాలని వారు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.
ఇకపోతే ఎలిమినేషన్ లో ఉన్నటువంటి నేహా చౌదరి కోసం ప్రముఖ క్రికెటర్ దిగ్గజ బ్రియన్ లారా రంగంలోకి దిగి నేహా చౌదరిని సేవ్ చేయాలనీ తనకు ఓటు వేయాలని సోషల్ మీడియా వేదికగా తనకు సపోర్ట్ చేశారు.ఇలా క్రికెట్ దిగజం బిగ్ బాస్ కంటెస్టెంట్ కు సపోర్ట్ చేయడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే నేహా చౌదరి కి క్రికెట్ మధ్య ఎంతో అనుబంధం ఉంది.
Bigg Boss6: నేహా చౌదరికి మద్దతుగా క్రికెటర్..
నేహా చౌదరి యాంకర్ గా స్పోర్ట్స్ ప్రజెంటేటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇండియా క్రికెట్ మ్యాచ్ లకు తెలుగు కామెంట్రీ చేసే వారిలో నేహా ఒకరు. ఇలా కామెంట్రీ గా పని చేస్తున్నటువంటి ఈమెకు క్రికెటర్ లారాతో ఎంతో మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ వారం తను నామినేషన్ లో ఉండగా తనకు ఓటు వేసి సేవ్ చేయాలంటూ లారా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె కోసం క్రికెట్ దిగజం సపోర్ట్ చేయడంతో ఆయన మద్దతు ఈమెకు ఏమాత్రం అయినా ఉపయోగపడుతుందా లేదా అనే విషయం తెలియాలి.