బిగ్ బాస్ సీజన్ 6 ఐదో వారం ఎండ్ కి వచ్చింది. ఇప్పటి వరకు షో రసవత్తరంగానే సాగుతుంది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్స్ కి ఆడియన్స్ నుంచి అనుకున్న స్థాయిలో స్పందన లేకపోయినా ఓటీటీలో మాత్రం బాగానే నడుస్తుంది. స్టార్ మాకి ఈ సారి డిజాస్టర్ రేటింగ్ ని బిగ్ బాస్ సీజన్ 6 అందించింది అని చెప్పాలి. ఈ సీజన్ లో హౌస్ లో గేమ్ ఆడే కంటిస్టెంట్ ల కంటే ఆడకుండా కాలక్షేపం చేస్తున్నవారే ఎక్కువగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వరుసగా మూడు వారాలు ఎలిమినేట్ అయినవారి జాబితా చూసుకున్నా అలాగే ఉంది. అస్సలు హౌస్ లో కెమెరాలలో కనిపించకుండా గడిపిన వారిన హౌస్ నుంచి బయటకి పంపించేశారు.
మొదటి వారం ఎలిమినేషన్ ని ఆపేసారు. హౌస్ లోకి వచ్చిన అందరూ సెట్ కావడానికి టైం పడుతుందని మొదటివారం ఎలిమినేషన్ ఈ సీజన్ లో చేయలేదు. రెండో వారం షాని సోలొమన్ ఎలిమినేట్ అయిపోయాడు. మూడో వారం అభినయశ్రీ, నాలుగో వారం నేహా చౌదరి హౌస్ నుంచి బయటకి వెళ్లిపోయారు. వీరికి ఆడియన్స్ నుంచి తక్కువ ఓటింగ్ రావడంతోనే బయటకి పంపించేశారు. ఇక ఐదో వారంలో నాలుగో ఎలిమినేషన్ గా హౌస్ నుంచి బయటకి ఎవరు వెళ్తారనే టాక్ ఇప్పుడు నడుస్తుంది.
వారిలో అర్జున్ కళ్యాణ్, సుదీప్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. నాలుగో వారం వరకు ఇనాయ సుల్తానా పేరు ఈ ఎలిమినేషన్ జాబితాలో వినిపించేది. అయితే ఈ సారి మాత్రం ఆమె తన ఆటతీరుతో ముందు వరుసలోకి వచ్చేసింది. ఆమెకి ఓటింగ్ కూడా బాగా జరిగింది. బయట ఆర్జీవీ సపోర్ట్ ఉండటంతో అతను కూడా ఆమెని ప్రమోట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ వారం తమ ఆటతో ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకొని అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. సుదీప గేమ్ బాగున్నా కూడా ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఆమెకి బయట ఆడియన్స్ సపోర్ట్ తక్కువగా ఉంది. దీంతో డేంజర్ జోన్ లోకి వస్తుంది.