Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు సీజన్‌పై ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి. ఆట లేదు.. ఎంటర్‌టైన్ మెంటూ లేదు. కనీసం రివ్యూ చెప్పుకుందామన్న అక్కడ కంటెంటే లేదు. అలాంటప్పుడు రేటింగ్ ఎలా గెయిన్ అవుతుంది. సరే కాసేపు ఈ రేంటింగ్ గొడవను పక్కనబెట్టుకుందాం. సోమవారం నామినేషన్స్ పర్వం ముగిసింది. ఈ సారి నామినేషన్స్‌లో పెద్ద సంఖ్యే ఉంది. దాదాపు హౌస్ మొత్తం ఉంది. అయితే ఎక్కువ నామినేషన్స్ మాత్రం రేవంత్‌కే పడ్డాయి.
రేవంత్‌కి అంతా ఒకే ఒక్క కారణం చెప్పారు. కెప్టెన్‌గా ఉండి నిద్రపోయాడన్న కారణం చెప్పి ఒకరిద్దరు మినహా దాదాపు హౌస్ మొత్తం అతన్ని నామినేట్ చేసింది. ఇక రేవంత్ నామినేషన్స్‌లో ఉన్నాడంటే అతని ఓటింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్టింగ్‌లో ప్రతి ఒక్కరూ రేవంత్‌ను నామినేట్ చేయడం.. టాస్క్‌ల్లో అదరగొట్టినా కూడా అతన్ని వెనక్కి నెట్టేయడం.. కనీసం కెప్టెన్సీ కంటెండర్‌గా కూడా అతనికి అవకాశం ఇవ్వకపోవడం వంటి అంశాలన్నీ రేవంత్‌కు ప్లస్ అయ్యాయి. కావల్సినంత సింపథీ వచ్చేసింది.
దీంతో రేవంత్ నామినేషన్స్‌లో ఉన్నాడంటే.. అతనికి ఓటింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అతని దరిదాపుల్లో కూడా వేరొక కంటెస్టెంట్ ఉండడు. అలాంటిది ఈ సారి అతని ఓటింగ్‌ని తొలిసారిగా శ్రీహాన్ క్రాస్ చేశాడు. అనూహ్యంగా నిన్న రేవంత్ ఓటింగ్‌ని శ్రీహాన్ దాటేశాడు. శ్రీహాన్‌కి 20 పర్సెంట్ ఓటింగ్ పడితే.. రేవంత్‌కి 18 పర్సెంట్ ఓటింగ్ పడింది. పెద్దగా డిఫరెన్స్ లేకున్నప్పటికీ గతంలో అయితే రేవంత్‌కి 25 పర్సెంట్ అలా ఉంటే.. నెక్ట్స్ ఉండే కంటెస్టెంట్ ఏ 15 లోనో ఉండేవాళ్లు. అలాంటిది ఏకంగా రేవంత్‌ను బీట్ చేయడం వండర్ అనిపించట్లే.. ఇక ఇప్పటి నుంచి వీళ్లద్దరిలో విన్నర్ ఎవరవుతారనే ఆసక్తి నెలకొంటుందేమో..