Bigg Boss: తెలుగు బాషలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రెండు వారాలు గడిచిపోయాయి. మొదటి వారంలో ఎలిమినేషన్ నుండి కంటెస్టెంట్స్ తప్పించుకున్నారు. కానీ రెండో వారంలో శనివారం ఎపిసోడ్ లో షనీ సాల్మన్ ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో అభినయ శ్రీ ఎలిమినేట్ అయింది. దీంతో 21 మంది కంటెస్టెంట్స్ కాస్త హౌస్ లో 19 మంది అయ్యారు.
గత రెండు వారాల పాటు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో కొందరు హైలెట్ అవ్వడానికి ప్రయత్నించగా, మరికొందరు మాత్రం హా చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని కూల్ గా కాలం గడిపారు. ఇందులో జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఫేం తెచ్చుకున్న గీతూ రాయల్ మాత్రం రాయలసీమ బాష, యాసతో తనదైన శైలిలో టాస్క్ లు ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిందనే చెప్పవచ్చు. ఓ క్రమంలో గీతు ప్రదర్శనకు ఎక్కడ ఎలిమినేట్ అవుతుందో అని కూడా అందరూ అనుకున్నారు.

ఊహించని విధంగా శనివారం ఎపిసోడ్ లో గీతూ ప్రదర్శనకు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఏకంగా 100 కు 200 మార్కులు వేశారు. మీరు చూసింది ఇంకా 20 శాతం మాత్రమే నాలో ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయంటూ నాగార్జునకు గీతూ తన గురించి గొప్పగా చెప్పుకుంది. సరే ఆ 80 శాతం ప్రదర్శన చూసేందుకు మేము సిద్దంగా ఉన్నామంటూ నాగార్జున స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో గీతూ రాయల్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.కానీ, ఎలిమినేషన్స్ లో భాగంగా రెండో వారంలో ఇద్దరు హౌస్ నుండి బయటికి వెళ్లిపోయారు. ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ లో ఆదిరెడ్డి, అభినయ చివరి వరకు వచ్చారు.
అభినయ ఎలిమినేట్ కాగా, ఆదిరెడ్డి సేఫ్ అయ్యారు. దీంతో గీతూ రాయల్ ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. అభినయ ఎలిమినేషన్ తో గీతూ సంబరపడింది. ఎంతలా అంటే గీతూ రియాక్షన్ చూస్తే ఎలిమినేట్ అయిన అభినయ బాధపడేలా అన్నట్లు అందరికీ అనిపించేలా కనిపించింది. అభినయ శ్రీ గట్టి పోటీ ఇస్తుందనే ఆలోచనతోనా లేక ఆదిరెడ్డితో హౌస్ లో ఉన్న బాండింగ్ తోనా అనే విషయం పక్కకు పెడితే గీతూ రియాక్షన్ కాస్త ఎక్కువ అనిపించింది. దీంతో మంచి ప్రదర్శనతో దూసుకుపోతున్న గీతూ రాయల్ హౌస్ లో ఉన్నవారి కంటే ఎందుకు ఎక్కువగా అభినయ శ్రీ ఎలిమినేషన్ విషయంలో సంబరపడిపోయిందబ్బా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.