తెలుగులో మంచి ఆదరణను సొంతం చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ 5 తో జనాలను అలరిస్తుంది.లాస్ట్ త్రీ వీక్స్ పర్వాలేదనిపించిన ఈ షో ఈ వీక్ అంతా ప్రజల ఓపికకు పరీక్ష పెట్టింది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నూతన కెప్టెన్ గా శ్రీ రామచంద్రా పగ్గాలు చేపట్టారు.వీకెండ్ లో అయిన గొడవలు పడకుండా ఇంటి సభ్యులు వినోదాన్ని పంచుతారని ఆశించిన వేళ వరస్ట్ పర్ఫార్మర్ ను ఇంటి సభ్యులు ఎన్నుకోవాలని బిగ్ బాస్ రచ్చను రాజేశారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమోని స్టార్ మా వాళ్ళు విడుదల చేశారు.
ఇందులో నటరాజ్ మాస్టర్ రవి మధ్య వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది.అలాగే శ్వేత,కాజల్ మధ్య కొత్త చిచ్చు రాజుకుంది.మరి ఈ వ్యవహారాలు ఎంత దూరం వెళ్తయో వేచి చూడాల్సింది