సోషల్ మీడియా సెన్సేషన్ అయిన షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో ఈ మధ్య నోరు ఎక్కువగా జారుతున్నాడు.అందరికీ అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు అని సలహాలు ఇచ్చే షన్ను అస్తమానం నోరు జారుతుండడంతో బిగ్ బాస్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా షన్నుని ట్రోల్ చేస్తున్నారు.ఈ సీజన్ టాప్ కన్టెండర్స్ అయిన షన్ను,సన్నీ ఇలా అస్తమానం నోరు జారడం ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా మారుతుంది.
నిన్నటి ఎపిసోడ్ లో షన్ను కాజల్, మానస్ లను ఉద్దేశించి భిక్ష వేశాడనడం,కాజల్ ను నామినేట్ చేసేటప్పుడు నువ్వు ఇంట్లో నుండి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయని అనడం వంటివి బిగ్ బాస్ వీక్షకులను చాలా ఇబ్బంది పెట్టాయి.ఇలాంటి ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్న సన్నీ,షన్నులకు నాగార్జున ఘాటైన వార్నింగ్ ఇవ్వాలని బిగ్ బాస్ ప్రేక్షకులు ఆశిస్తున్నారు.