Bigboss sunny: బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో చాలా మంది బుల్లితెరపై ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. బిగ్‌బాస్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అలాగే కొంత మందికి కలిసి రాలేదు. కానీ ఎక్కువ శాతం మందికి మాత్రం లైఫ్ టర్న్ అయిపోయింది. కొందరు సినీ ఇండస్ట్రీలో సైతం సందడి చేస్తున్నారు. ఇప్పటికే తేజు మడివాడ వెండితెరపై సందడి చేస్తుండగా.. బిగ్‌బాస్ విన్నర్ సన్నీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏ సీజన్‌ను చూసుకున్నా బిగ్‌బాస్ టైటిల్ విన్నర్స్‌కి పెద్దగా కలిసి రాలేదు. కానీ మిగతా కంటెస్టెంట్స్ మాత్రం అస్సలు ఊరు పేరు తెలియని వాళ్లు కూడా బుల్లితెరపై బాగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.

టైటిల్ విన్నర్స్ కంటే మిగతా కంటెస్టెంట్స్ సినిమాలతో టెలివిజన్ షోలతో బిజీ అవుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో ఇప్పటివరకు టైటిల్ విన్నర్ అయిన వారిలో ఎవరు కూడా కెరీర్ మరో రేంజ్ కు వెళ్లే విధంగా క్లిక్కవ్వలేదు. తొలి రెండు సీజన్లలో విన్నర్స్ అయిన శివబాలాజీ, కౌశల్ మండా ను ఎక్కువ రోజులో ఎవరు గుర్తు పెట్టుకోలేదు. ఇక ఆ తరువాత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తన సింగింగ్ టాలెంట్ తోనే నిలదొక్కుంటున్నాడు. నాలుగో సీజన్ విన్నర్ అభిజిత్ అతి గతి లేకుండా పోయాడు.5వ సీజన్ విన్నర్ సన్నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి సైతం సాధించిందేమీ లేదు.
Bigboss sunny: డైమండ్ రత్నబాబు చెప్పిన కంటెంట్ కు కనెక్ట్ అయ్యాడట..
ఇక ఇటీవల సన్నీకి మాత్రం రోజులు కలిసొస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ విన్నర్ సన్నీ సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌తో మల్టీస్టారర్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతను మొదట ఒక రిపోర్టర్ స్థాయి నుంచి ఆ తరువాత ఒక నటుడిగా కూడా తన కెరీర్ ను కొనసాగించాడు. అతను డైమండ్ రత్నబాబు చెప్పిన కంటెంట్ కు కనెక్ట్ అయ్యాడట. అతను చెప్పిన ఒక మినీ మల్టీస్టారర్ కథ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడట. అన్ స్థాపబుల్ అనే టైటిల్ తో రానున్న ఆ సినిమాకు నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.అందుకు సంబంధించిన పోస్టర్‌ను రీసెంట్‌గా విడుదల చేశారు.