Bigboss 6 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి ఆరో సీజన్ ప్రారంభం అవుతుండటంతో నిర్వాహకులు బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల ఎంపిక సైతం పూర్తైంది. వారితో అగ్రిమెంట్స్ కూడా జరిగిపోయాయి. ఒకటి రెండు రోజుల్లోనే వారిని క్వారెంటైన్‌కి కూడా పంపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే బిగ్‌బాస్ సీజన్ 6 కి సంబందించిన ప్రారంభోత్స ఎపిసోడ్ కోసం సెట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కంటెస్టెంట్స్ సైతం ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారని సమాచారం.
మరోవైపు బిగ్‌బాస్ నిర్వాహకులు షో ప్రారంభానికి ముందే గేమ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ని హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్స్‌లో క్వారంటైన్‌కి పంపేశారని ఓ టాక్ నడుస్తుంటే తాజాగా బయటకు వచ్చిన న్యూస్ షాక్ ఇస్తోంది. కంటెస్టెంట్స్ లిస్ట్‌లో నిన్న మొన్నటి వరకూ సోషల్ మీడియా సెలబ్రిటీ ఈ మధ్యే పండుగాడ్ సినిమాతో హీరోయిన్గా మారిన దీపికా పిల్లి పేరు ప్రముఖంగా వినిపించింది. నిజానికి బిగ్ బాస్ సెలక్షన్ లిస్ట్‌లో ఈమె పేరు తొలి వరుసలో ఉండగా.. చివరి నిమిషంలో ఆమె బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నట్టు తెలుస్తోంది. కానీ నెటిజన్లు మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో తేడాలొచ్చి దీపికను తీసి పక్కన బెట్టి మరో యాంకర్ వర్షిణిని తీసుకున్నారని టాక్ బలంగానే నడుస్తోంది.
Bigboss 6 : బుల్లితెరపై దీపిక కంటే వర్షిణికే ఎక్కువ ఫాలోయింగ్
నిజానికి పాపులారిటీపరంగా చూస్తే.. యాంకర్ వర్షిణికి 1.8 మిలియన్ల మంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే.. దీపిక పిల్లికి ఏకంగా 2.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. యాంకర్ వర్షిణి కూడా దీపిక పిల్లి కంటే ఫాలోవర్స్ తక్కువ అన్న మాటే కానీ.. బుల్లితెరపై దీపిక కంటే ఎక్కువ ఫాలోయింగ్ వర్షిణికే ఉంది. పైగా సినిమాల్లో చేసిన అనుభవంతో మంచి పీఆర్ టీంతో పాటు ఫ్యాన్ బేస్ కూడా వర్షిణికి బాగానే ఉంది. మరి ఈ జబర్దస్త్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌లో ఎంతవరకూ రాణిస్తుందో చూడాలి. ఇక ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.