బిగ్ బాస్ సీజన్-5 చాలా సప్పగా సాగడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకుండానే ఈ సీజన్ ను బిగ్ బాస్ యాజమాన్యం ముగించేసింది.ఇక ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్ లో నాగార్జున మరో రెండు నెలల్లో బిగ్ బాస్ ఉంటుందని హింట్ ఇచ్చారు.తాజాగా దీనిపై డిస్నీ హాట్ స్టార్ ఒక సమావేశం ఏర్పాటు చేసింది.అందులో పాల్గొన్న అక్కినేని నాగార్జున ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు.
ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడిన నాగార్జున దాదాపు 6 కోట్ల మంది ప్రజల ఆదరణను సొంతం చేసుకున్న బిగ్ బాస్ షో ఓటిటిని త్వరలో ప్రారంభించబోతున్నామని నాకు డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యం తెలిపింది.ఈ షోకి హోస్ట్ గా నేను వ్యవహరించబోతున్నాను.దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్,మరియు షో వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు.