నిన్న జరిగిన స్పెషల్ వేడుకలతో కాస్త కూల్ అయ్యిందని అనుకున్న బిగ్ బాస్ హౌస్ నామినేషన్‌ల పర్వం అనంతరం మళ్ళీ హిట్ ఎక్కింది.
ఈ వారం నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేసిన సన్నీ వ్యక్తిగతంగా బాగా ఆడుతున్న రవి,టీమ్ గేమ్స్ వచ్చేసరికి బ్యాక్ పెయిన్ అని తప్పించుకోవడం నచ్చలేదని నామినేట్ చేశారు.ఇక ఆతరువాత జెస్సీ తనని డబ్బు కోసం ఆట ఆడాను అనడం హర్టింగ్ గా అనిపించిందని నామినేట్ చేశారు.
ఇక ఆతర్వాత వచ్చిన విశ్వ ప్రతిసారీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లని ఆనీ మాస్టర్ నామినేట్ చేయడం నచ్చట్లేదని చెప్పి ఈసారి ఆమెను నామినేట్ చేశారు అలాగే తను సంఛాలకుడిగా వ్యవరిస్తున్న టాస్క్ లో తన మాటను ప్రియాంక తప్పుగా తీసుకోవడం నచ్చలేదని ఆమెను కూడా విశ్వ నామినేట్ చేశారు.
తనని అగ్రెసివ్ అని సిరి టాస్క్ లో సంబోధించడం తనకి నచ్చలేదని చెప్పిన శ్వేత మొదట సిరిని నామినేట్ చేసి ఆతర్వాత తనని నామినేట్ చేయాలని ఇంట్లో సభ్యులను మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించిన కాజల్ ను నామినేట్ చేశారు.టాస్క్ లో నమ్మకంగా వ్యవహరించలేదని లోబో ప్రియాంక, జెస్సీలను నామినేట్ చేశాడు.ఇక ఆతర్వాత వచ్చిన సిరి శ్రీరామచంద్ర కెప్టెన్ గా పక్షపాతం చూపించాడని తాను చెప్పింది శ్వేత తప్పుగా అర్ధం చేసుకుందని వారిద్దరినీ నామినేట్ చేసింది.
కెప్టెన్సీ టాస్క్ లో తన డ్రమ్ములోంచి మానస్ నీళ్ళు తీయడం తనని బాగా హార్ట్ చేసిందని రవి ముందుగా మానస్ ను నామినేట్ చేశాడు.అలాగే రవి తన బిడ్డ మీద ఒట్టేశాడని అందరితో సిరి చెప్పడం తనకు నచ్చలేదని చెబుతూ రవి సిరిని నామినేట్ చేశాడు.
అయిపోయిన కిచెన్ గొడవను మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చిన జెస్సీ శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు.అలాగే తాను సన్ని అభిప్రాయంతో ఏకీభవించట్లేదని సన్నిని కూడా నామినేట్ చేశాడు.
ఇక ఆతర్వాత వచ్చిన ప్రియాంక లోబో, విశ్వలను నామినేట్ చేయగా.మానస్ రవి, లోబోలను నామినేట్ చేశాడు.కిచెన్ గొడవలో అత్యుత్సాహం ప్రదర్శించిన షణ్ముఖ్ ను నామినేట్ చేసిన ఆనీ మాస్టర్ దొంగ నాటకాలు ఆడకు అలాగే నన్ను ఇక నుండి అక్క అని పిలవకు అంటూ విశ్వపై ఫైర్ అయ్యి అతన్ని నామినేట్ చేసింది.
ఇక గతవారం జరిగిన కిచెన్ గోడవపై పూర్తి అసంతృప్తితో ఉన్న శ్రీరామచంద్ర సిరి, షన్నులను నామినేట్ చేయగా.తర్వాత వచ్చిన కాజల్ శ్రీరామచంద్రను ఇక నుండి నార్మల్ హౌస్ మేట్ గా మాత్రమే చూస్తానని చెబుతూ అతనితో పాటు శ్వేతను నామినేట్ చేసింది.ఇక తర్వాత వచ్చిన షన్ను శ్రీరామచంద్ర, లోబోలను నామినేట్ చేశాడు. ఈవారం ఇంటి కెప్టెన్ అయిన ప్రియ రేషన్ మ్యానేజర్ గా ఫెయిల్ అయిన విశ్వను సన్నీలను నామినేట్ చేసింది.