లాస్ట్ శనివారం నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్ నుండి సభ్యులను బయటకు పంపే అధికారం ఆడియెన్స్ కు మాత్రమే ఉందని చెప్పారు.దానికి బాగా కనెక్ట్ అయిన ఆడియెన్స్ ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా ఈసారి పోల్స్ లో పాల్గొంటున్నారు.దాదాపు అన్ని వారాల నుండి నామినేషన్స్ లో ఉంటూ సేఫ్ అవుతూ వస్తున్న ప్రియకు ఈవారం బిగ్ బాస్ ఆడియెన్స్ చేదు అనుభవాన్ని అందివ్వనున్నారు.
గతంలో హౌస్ లో జరిగిన బేటన్ టాస్క్ లో ఇంటి సభ్యులపై సైలెంట్ గా ప్రియ దాడి చేసిన,దాన్ని లైట్ తీసుకున్న బిగ్ బాస్ ఆడియెన్స్ ఈ వీక్ లో ప్రియ చేసిన ఓవర్ యాక్షన్ కు బాగా హార్ట్ అయ్యారు.ఇంట్లో ఎప్పుడూ సైలెంట్ గా ఉండే షణ్ముఖ్ సైతం ప్రియ మీద తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.మరి అంత ఓవర్ యాక్షన్ చేసిన ప్రియపై ఈ వీకెండ్ లో నాగార్జున ఎలా స్పందిస్తారో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఆమె కంటే తక్కువ ఓట్స్ పోల్ అవుతున్న యాని మాస్టర్ ఓటింగ్ ను పెంచుతున్నారు.ఈ టాస్క్ ను చాలా సీరియస్ గా తీసుకున్న సన్నీ అభిమానులు ప్రతిరోజు ప్రియ కంటే తక్కువ పోలింగ్ ఎవరికి వస్తుందో చూసుకొని వాళ్ళకు ఓట్ చేసి వాళ్ళ పర్సేంటేజ్ ను పెంచుతున్నారు.
ఇక సీక్రెట్ టాస్క్ లో ఇంటి సభ్యుల ప్రవర్తనను పూర్తిగా గమనించిన లోబో ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నాడు. మొన్న ఇంటి నుండే వెళ్ళేటప్పుడు లోబో నువ్వు మారాలి జాగ్రత్త అంటూ సన్నీకి సూచనలు చేశాడు.వాటి సంఖ్య ఈరోజు నుండి పెరగనుంది.టాస్క్ లో హండ్రెడ్ పర్సంటేజ్ ఇస్తున్న సన్నీని కావాలని టార్గెట్ చేస్తున్న ప్రియ ప్రవర్తన పై లోబో కూడా అసహనం వ్యక్తం చేశాడు అందుకే హౌస్ లోకి వచ్చాక సన్నీకి సపోర్ట్ గా లోబో ఉంటాడని సన్నీ అభిమానులు ఆశిస్తున్నారు.అందుకే పోలింగ్ లో అతనికి కూడా కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెంచే బాధ్యతను సన్నీ అభిమానులు తీసుకుంటున్నారు.
మొదట నుండి కలిసి కట్టుగా ఉంటున్న త్రిమూర్తులు మధ్య విబేధాలు రావడం ఈరోజు ప్రోమోలో చూపించారు మరి అది ఎంత దూరం వెళ్తుందో ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది