ఈ ఏడాది బిగ్ బాస్ తన హౌస్ లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్ లను పంపారు.ఇక గడిచిన మూడువరాలలో బిగ్ బాస్ ముగ్గురు లేడీస్ ను ఇంటి నుండి బయటకు పంపారు.దీంతో ఇక ఈ వీక్ బిగ్ బాస్ మరోసారి లేడిని బయటకు పంపుతారా లేక జెంట్ ను బయటకి పంపుతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం జరిగిన ఓటింగ్ ప్రకారం నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నారు.వీరిద్దరిలో నటరాజ్ మాస్టర్ జంతువులతో ఇతర ఇంటి సభ్యులను పోలుస్తూ అటు ఇంట్లో ఉన్నవాళ్ళకి ఇటు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నారు.అందుకే ఆయనకి ఈసారి ఓట్ పోల్ తక్కువ అయ్యిందని సమాచారం.