వారమంతా గొడవలు,రచ్చలతో సాగిన బిగ్ బాస్ హౌస్ ను ఆర్డర్ లో పెట్టడానికి మనల్ని ఎంటర్ టైన్ చేయడానికి నాగార్జున గారు వీకెండ్ తో వచ్చేశారు.తాజాగా స్టార్ మా వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోమో లో నాగార్జున గారు షణ్ముఖ్,సిరి,లోబొలకు గట్టి క్లాస్ తీసుకున్నారు.ఈ ప్రోమో లో షణ్ముఖ్ చేత మిర్చి కొరికించిన నాగార్జున గారు ముచ్చట్లు పక్కనపెట్టి ఆట ఆడు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇక ఇవాళ్టి ఎపిసోడ్ లో నాగార్జున గారు ఎవర్ని సేవ్ చేస్తారు,ప్లేట్ లో ఉంచిన మిగిలిన మిర్చిని ఎవరి చేత తినిపిస్తారో వేచి చూడాల్సివుంది.గత వారం హౌస్ మేట్స్ తప్పులను ఎత్తిచూపిన నాగార్జున గారు ఈ వారం కూడా అదే చేయబోతున్నారని ప్రోమో చూస్తే అర్థమవుతుంది.