బిగ్ బాస్ హౌస్ లో ఈవారం జరిగిన రచ్చ ఇంటి సభ్యుల మధ్య చాలా చిచ్చులు రేపాయి వాటిపై ఈరోజు నాగార్జున ఎలా స్పందిస్తారో అని బిల్లితెర అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈవారం ఇంట్లో ఓవర్ యాక్షన్ చేసిన సభ్యులు ఎవరు వారిలో ఎవరికి అక్షింతలు పడే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఈవారం మెజారిటీ సభ్యులు నామినేట్ చేసిన షణ్ముఖ్ ఇంట్లో చాలా ఓవర్ యాక్షన్ చేశాడు.శ్రీ రామ్ చంద్రా, హమీద లను టార్గెట్ చేసి గేమ్ ఆడాడు.ఇది బిగ్ బాస్ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు.దీనిపై నాగార్జున షణ్ముఖ్ కు స్పెషల్ క్లాస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి గుడ్డిగా షణ్ముఖ్ ను ఫాలో అవుతున్న సిరి శ్రీ రామ్ చంద్రా తో ముందు వెనక ఆలోచించకుండా గొడవ పడి దాన్ని పెద్దది చేసింది.
ఈ అంశంపై ఆమెకు అక్షింతలు పడే అవకాశం ఉందిఇక ఈవారం అన్ని గొడవలకు కారణమైన జెస్సీకి నాగార్జున గట్టిగా క్లాస్ పీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
కాజల్ కు మిడిల్ ఫింగర్ చూపి లోబో మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు.ఈ విషయంలో నాగార్జున ఘాటుగా స్పందించే అవకాశం ఉంది.
కెప్టెన్సీ టాస్క్ తో ఆడియన్స్ లో మంచి పాజిటివ్ రిమార్క్స్ తెచ్చుకున్న రవి లాస్ట్ డే ఇంటి సభ్యులను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసి కెమెరాలకు అడ్డంగా దొరికాడు.అలాగే కెప్టెన్సీ లో కూడా వేలు పెడుతున్నాడు ఇది ఈరోజు నాగార్జున గారి కోపానికి కారణం కానున్నది.
ఇక కాయిన్స్ దొంగతనం చేసినవారి పై ఘాటుగా స్పందించిన విశ్వ వ్యాఖ్యలపై నాగార్జున గారు అదే స్థాయిలో స్పందించే అవకాశాలు ఉన్నాయి.
నెక్స్ట్ నామినేషన్స్ లో శ్వేతను నామినేట్ చేద్దామని వ్యాఖ్యలు చేసిన కాజల్ కు ఈ వారం అక్షింతలు తప్పేలా లేవు
ఇతరులు తన గురించి ప్రియాంక గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని ప్రియాంకను దూరం పెట్టిన మానస్ కు ఈవారం అక్షింతలు పడే అవకాశాలు ఉన్నాయి.