BigBoss: తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో పెద్దగా ఆసక్తికరంగా సాగడం లేదు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ చాలా తక్కువ టీఆర్పీ రేటింగ్ తో నడుస్తోంది. గతంలో మాదిరిగా పెద్దగా సినీ, బుల్లితెర ప్రముఖులు లేకపోవడంతో ఈసారి బిగ్ బాస్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు కూడా పెద్దగా ఆసక్తికర్ంగా లేకపోవడంతో జనాలు దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు.
బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ చాలామంది జనాలకు బిగ్ బాస్ షో నడుస్తోందనే విషయం కూడా తెలియడం లేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 6కు 2.5 రేటింగ్ రావడంతో నిర్వాహకులు కూడా సందిగ్దంలో పడ్డారు. అసలు ఏం చేస్తే బిగ్ బాస్ 6 ఆకట్టుకుంటుందనే ఆలోచనలో పడ్డారు.
కాగా నాలుగో వారం జరిగిన ఎలిమినేషన్ లో ఊహించని విధంగా బుల్లితెర నటి ఆరోహి బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఉన్నది నాలుగు వారాలే అయినా కానీ ఆరోహి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అన్ని టాస్కులను తనదైన స్టైల్లో ఆడటంతో పాటు అందరితో బాగా కలిసిపోయింది.
ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌజ్ నుండి ఆరోహిని హౌజ్ నుండి ఎలిమినేట్ చేయడం మీద బిగ్ బాస్ వీక్షకులు, ఆరోహిని అభిమానించే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరోహి బాగా ఆడిందని, బిగ్ బాస్ హౌజ్ లో ప్రస్తుతం ఉన్న వారికంటే ఆమె చాలా బెటర్ అని అంటున్నారు.
BigBoss: ఆరోహికి ఎంత వచ్చిందంటే?
బిగ్ బాస్ హౌజ్ నుండి నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన ఆరోహి.. నాలుగు వారాలకు గాను ఎంత రెమ్యునరేషన్ తీసుకుందన చర్చ సాగుతోంది. ఆరోహి వారానికి రూ.15వేల చొప్పున తీసుకునే డీల్ తో బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిందని, నాలుగు వారాలకు గాను రూ.60వేలు అందినట్లు తెలుస్తోంది. కాగా ఆరోహి మంచి కంటెస్టెంట్ అని, ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద తిరిగి బిగ్ బాస్ హౌజ్ లోకి పంపాలనే డిమాండ్ వినిపిస్తోంది.