బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ కు రాకుండా ఇంత కాలం గడిపిన విశ్వ ఫైనల్ గా ఈవారం నామినేషన్స్ లోకి వచ్చాడు.అందరికంటే తక్కువ ఆదరణ ఉన్న విశ్వ గేమ్ తీరు కూడా జనాలకి నచ్చకపోవడం బిగ్ బాస్ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సన్నీ,మానస్ లతో విశ్వ గొడవపడడం కారణంగా ఈవారం జరిగిన ఓటింగ్ లో అతనికి మిగతా ఇంటి సభ్యుల కంటే తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి.
అందుకే అతన్ని ఈవారం ఇంటి నుండి పంపడానికి బిగ్ బాస్ యాజమాన్యం సిద్ధమైందని సమాచారం.మొదట్లో తన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వ గత కొద్దిరోజుల నుండి జరిగిన సంఘటనలతో నెగిటివిటిని మూట కట్టుకున్నాడు అది ఇప్పుడు అతన్ని ఇంటి నుండి పంపడానికి కారణం అవుతుంది.