ఈవారం బిగ్ బాస్ వినూత్నంగా నిర్వహించిన నామినేషన్స్ ప్రక్రియ ద్వారా ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు.ఈసారి నామినేషన్స్ లో ఉన్నవారందరికి బిగ్ బాస్ ఆడియెన్స్ లో మంచి సపోర్ట్ ఉంది.అందుకే ఈసారి ఎవరూ ఇంటి నుండి బయటకు వెళ్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు సీక్రెట్ రూం నుండి మళ్ళీ ఇంట్లోకి వచ్చిన లోబోకు ఈ వారం స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది అందుకే మిగిలిన ఇంటి సభ్యుల కంటే లోబోకు తక్కువ ఓటింగ్ పోల్ అవుతుంది.అందుకే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి లోబో బయటకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది.