19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది.లాస్ట్ వీక్ ఆర్.జే.కాజల్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడంతో ఫినాలే టాప్ 5లో సన్నీ,సిరి,షన్ను,మానస్,శ్రీరామ్ చంద్ర లు నిలిచారు.ఇక బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ ఈ ఆదివారం గ్రాండ్ గా జరగబోతుంది.ఈ ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 5 ముగుస్తుంది అందుకే బిగ్ బాస్ యాజమాన్యం ఈ ఎపిసోడ్ కోసం భారీగా ప్లాన్ చేసిందని సమాచారం.
డిసెంబర్ 19వ తేదీన జరగనున్న ఈ ఫినాలే ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి మరియు అతని టీమ్ ను పిలిచరని దానికి వారు కూడా ఓకే అన్నారని ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ ఎపిసోడ్ కు టాలీవుడ్ ప్రముఖులే కాదు బాలీవుడ్ ప్రముఖులు కూడా అతిథులుగా రాబుతున్నారట మరి వారు ఎవరనేది ఇంకా తెలియలేదు కానీ ఫిల్మ్ సర్కిల్స్ వినిపిస్తున్న ఊహాగానాలు ప్రకారం బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్,దీపికా పదుకొనె అలాగే ఆర్.ఆర్.ఆర్ మూవీ నుండి చరణ్,ఆలియా భట్ రాబోతున్నారు.మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగక తప్పదు.