బిగ్ బాస్ 5 ఫినాలేకు దగ్గరకి అవుతుండడంతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల సంఖ్య తగ్గిపోతుంది.12వ వారం ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి రవి,సన్నీ,కాజల్,షణ్ముఖ్,సిరి,శ్రీరామచంద్ర,ప్రియాంక సింగ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఈవారం ఇంటి నుండి ఎవరు బయటికెళ్తారో ఇప్పుడు చూద్దాం.
రవి : ఎప్పటిలాగే ఈ వీక్ కూడా బిగ్ బాస్ వీక్షకులను తన వైపు తిప్పుకున్న రవి మంచి పోలింగ్ ను సంపాదించి ఈవారం ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యాడు.
షణ్ముఖ్ జస్వంత్ : సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ హౌస్ లో పెద్దగా గేమ్స్ ఆడకపోయినా తన ఫాలోయింగ్ తో నామినేషన్స్ నుండి సేఫ్ అయిపోతున్నాడు.
సన్నీ : హౌస్ లో ఎంటర్ అయినప్పటి నుండి తన స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ తో బిగ్ బాస్ అభిమానులను ఆకట్టుకుంటున్న సన్నీకి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగింది.ఆ ఫాలోయింగే నామినేషన్స్ నుండి సన్నీని సేఫ్ చేస్తుంది.
కాజల్ : ప్రస్తుతం హౌస్ లో వివాదాలకు పెట్టింది పేరుగా మారిన కాజల్ కు హౌస్ లోనే కాదు బిగ్ బాస్ అభిమానులలో కూడా మంచి గుర్తింపు లేదు.లాస్ట్ వికే ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వాల్సిన కాజల్ జస్ట్ మిస్ట్ అయ్యింది.ఈ వీక్ కూడా ఆమె సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి.
సిరి : యుట్యూబ్ స్టార్ అయిన సిరి షణ్ముఖ్ అభిమానుల ఓటింగ్ వల్ల ప్రతివారం ఎలిమినేషన్ నుండి తప్పించుకుంది.
శ్రీరామచంద్ర : మనోడికి హౌస్ లోనే కాదు బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.తన మాటతీరు,ఆటతీరుతో ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటున్న శ్రీరామ్ ఈ వీక్ మంచి ఓటింగ్ సొంతం చేసుకొని ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యారు.
ప్రియాంక సింగ్ : ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నవాళ్ళలో ఈమె మిగతా వాళ్ళకంటే వీక్ కంటెస్టెంట్.ఆట పరంగా కూడా అంతగా ఆకట్టుకొని ప్రియాంక ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది.