ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ లో చాలా వండర్సే జరిగాయి.పాపం మొదట వీక్ నుండి హౌస్ కెప్టెన్ అయ్యి తన దగ్గర ఉన్న కెప్టెన్ డ్రస్ వేసుకోవాలని కలలు కంటున్న సన్నీ కల ఈవారం బిగ్ బాస్ హౌస్ లో నెరవేరింది.దీంతో వరసగా రెండో వారం సన్నీ నామినేషన్స్ నుండి తప్పించుకోబోతున్నాడు.ఎప్పుడూ లెక్కలు వేసుకొని ఆడే రవి ఈవారం చేతి దాకా వచ్చిన కెప్టెన్సీ పదవిని సన్నీకి త్యాగం చేశాడు.హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఒకటిగా ఉన్న త్రిమూర్తులు మొదటిసారిగా మనస్పర్థలు వచ్చాయి.అవి జెస్సీ చొరవతో ఎట్టకేలకు దూరం అయ్యాయి.
ఇక ఈవారం బాగా ముదిరిన ప్రియ,సన్నీ గొడవ వీకెండ్ కు కనుమరుగు అయిపోయింది.ఇద్దరు మధ్య ఇప్పుడు మంచి ట్రాక్ నడుస్తుంది.ఎప్పుడూ యాక్టిివ్ గా ఉండే శ్రీరామ్ చంద్రా మళ్ళీ ఈ వీక్ అంతా డల్ అయిపోయాడు.హౌస్ లో వారం మొదట్లో జరిగిన గొడవలన్నీ వీకెండ్ వచ్చేసరికి ఎండ్ అయిపోయాయి.దీంతో ఈ వీకెండ్ నాగార్జున ఎవరికి క్లాస్ తీసుకుంటారో అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈవారం మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు.వారిలో ఎవరికి ఎంత పోలింగ్ జరిగిందో ఇప్పుడూ చూద్దాం.
పోల్స్ మొదలైన మొదటి రోజు నుండి వీక్ అంతా డల్ గా ఉన్న 20 పర్సంట్ ఓటింగ్ తో శ్రీరామ్ చంద్రా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక 19 పర్సంట్ ఓటింగ్ సంపాదించుకున్న రవి ప్రస్తుతం సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.ఇక త్రిమూర్తులలో ఒకరైన సిరి 13 పర్సంట్ ఓటింగ్ తో మూడవ స్థానంలో కొనసాగుతుంది.కెప్టెన్సీ కి దగ్గరగా వచ్చిన కాజల్ ఈసారి 12 శాతం ఓట్లతో తర్వాత స్థానంలో నిలిచింది.ఇక త్రిమూర్తులలో మూడవ వాడైన జెస్సీ 11 శాతం ఓట్లతో ఐదవ స్థానంలో నిలిచారు.
ఇక 10 శాతం ఓట్లతో లోబో,8 శాతం ఓట్లతో ప్రియ తర్వాత స్థానాలలో నిలవగా,ప్రియ,సన్ని గొడవతో వీక్ మొదట్లో ఓటింగ్ పెంచుకొని ప్రియ కంటే మెరుగైన స్థానంలో ఉన్న యాని వీకెండ్ కు లాస్ట్ ప్లేస్ కు చేరుకొని డేంజర్ జోన్ లో ఉన్నారు.ఈసారి ఒక్క నటరాజ్ మాస్టర్ తప్ప ఎలిమినేట్ అయ్యిందంతా ఆడవాళ్లే ఆ ట్రెండ్ ఈ వీక్ కూడా కొనసాగబోతుందని పోల్స్ చెబుతున్నాయి.