Bigboss 6 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి ఆరో సీజన్ ప్రారంభం అవుతుండటంతో నిర్వాహకులు బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల ఎంపిక సైతం పూర్తైంది. వారితో అగ్రిమెంట్స్ కూడా జరిగిపోయాయి. ఒకటి రెండు రోజుల్లోనే వారిని క్వారెంటైన్‌కి కూడా పంపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే బిగ్‌బాస్ సీజన్ 6 కి సంబందించిన ప్రారంభోత్స ఎపిసోడ్ కోసం సెట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కంటెస్టెంట్స్ సైతం ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారని సమాచారం.
కంటెస్టెంట్స్ ఎంట్రీకి ఏ సాంగ్ తీసుకోవాలో ఇప్పటికే సిద్ధం చేసి వారికి ఒక కొరియోగ్రాఫర్ సాయంతో మూమెంట్స్‌ను ప్రాక్టీస్ చేయిస్తున్నారని తెలుస్తోంది. అలాగే తొలి కంటెస్టెంట్‌గా ఎవరిని పిలవాలన్న దానిలోనూ క్లారిటీ వచ్చేసిందని తెలుస్తోంది. కొందరు కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లిన తరువాత వారి చేత ఎలాంటి టాస్కులు చేయించాలనే దానిపై సైతం కసరత్తు పూర్తైందని సమాచారం. మరో వైపు ప్రముఖులను ఆహ్వానించేందుకుగాను స్టార్ మా వర్గాల వారు సిద్ధం అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సీజన్‌కి ప్రారంభోత్సవ ఎపిసోడ్ హైలైట్‌గా ఉండేలా నిర్వాహకులు డిజైన్ చేస్తున్నారని సమాచారం.
Bigboss 6 : ఏవీ చిత్రీకరణలు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి..
బిగ్‌బాస్ గ్రాండ్ ప్రారంభోత్సవ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో రేటింగ్‌ను తీసుకొచ్చే దిశగా స్టార్ మా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని టాక్. ప్రారంభోత్సవ ఎపిసోడ్ ఆధారంగానే మొత్తం సీజన్‌ను కొందరు అంచనా వేస్తారు. కంటెస్టెంట్స్ బాగా తెలిసిన వారైతే ఆ షోకి రేటింగ్ దుమ్ము దులుపుతుంది. అందుకే అన్ని విధాలుగా అద్భుతంగా ఉంది అన్నట్లుగా టాక్ రావడం కోసం అభిమానులను అలరించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి సామాన్యులకు ఛాన్స్ ఇవ్వబోతున్నారు. కనుక వారికి సంబంధించిన ఏవీ చిత్రీకరణలు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ప్రారంభోత్సవ ఎపిసోడ్ హడావుడి ఇప్పటికే మొదలైందని టాక్.