Bigboss 6 : ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ అదరగొట్టేస్తోంది. ఇక తెలుగులో ఇది ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఆరో సీజన్‌లో అడుగు పెట్టబోతోంది. తొలినాళ్లలో ఇది తెలుగులో సక్సెస్ అవుతుందా? కాదా? అన్న మీమాంశ ఉండేది. కానీ తెలుగులోనూ టాప్‌లో దూసుకుపోతోంది. తొలి సీజన్‌లో ఎన్టీఆర్ తన హోస్టింగ్‌తో దుమ్మురేపితే.. నెక్ట్స్ సీజన్‌లో నాని అలరించాడు. ఇక మూడో సీజన్ మొదలు ఇప్పటి వరకూ నాగార్జున బిగ్‌బాస్ బాధ్యతలను మోస్తున్నారు. ఇప్పటికే ఈ షో కంటెస్టెంట్స్‌కి సంబంధించి పెర్ఫార్మెన్స్ షూట్ పూర్తై పోయింది. కొత్త బిగ్‌బాస్ హౌస్ ఎలా ఉండబోతోంది? కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్‌లకు సంబంధించిన ప్రోమోను ఇప్పటికే విడుదలైంది.
ఈ సీజన్‌కు సంబంధించి సరికొత్త న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. సరికొత్తగా రూల్స్ తీసుకొచ్చారని టాక్ వినిపిస్తోంది. నామినేషన్ ప్రక్రియ, శిక్షలను విభిన్నంగా ఏర్పాటు చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షో మొత్తంలో ఎలిమినేషన్ ప్రక్రియ చాలా హైలైట్‌గా ఉంటుంది. శత్రువులు మిత్రులుగానూ.. మిత్రులు శత్రువులుగానూ మారేది ఇక్కడే. దాని ఆధారంగానే షో రంజుగా సాగుతుంది. కాబట్టి కంటెస్టెంట్లను ఎలిమినేషన్ జోన్‌లోకి తీసుకొచ్చే నామినేషన్ టాస్క్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది గత ఐదు సీజన్లుగా సోమవారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ సారి నామినేషన్ ప్రక్రియను మరో రోజుకు మారుస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
Bigboss 6 : గత సీజన్ కంటే భిన్నంగా శిక్షలు
నామినేషన్ ప్రక్రియకు అనుగుణంగానే ఆరో సీజన్‌లో జరిగే ప్రక్రియలో పూర్తిగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని మరింత జోరుగా మార్చేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయబోతున్నట్లు బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సారి టాస్క్‌లను కూడా విభిన్నంగా ప్లాన్ చేయబోతున్నారని సమాచారం.
అంతేకాకుండా చెత్త ప్రదర్శన చేసిన కంటెస్టెంట్ల శిక్షలు కూడా గత సీజన్ కంటే భిన్నంగా ఉంటాయని టాక్ నడుస్తోంది.పోటీదారుల కోసం కొత్త టాస్క్‌లు ఈ సీజన్‌లో ఆసక్తికరంగా, కఠినంగా ఉంటాయని సమాచారం. ఇక ఈ షో 4వ తేదీ సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది.