బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు హౌస్ లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అని తెలుసు కానీ ఈ సీజన్ లో హౌస్ మేట్స్ అయిన షణ్ముఖ్, సిరిల మధ్య గొడవ ఎప్పుడు జరుగుతుందో మాత్రం అర్థం కావడం లేదు.గతవారం జెస్సీ సీక్రెట్ టాస్క్ విషయంలో తనని గ్రాంటెడ్ గా తీసుకుందని సిరిపై ఫైర్ అయిన షణ్ముఖ్ నిజానికి సిరిని గ్రాంటెడ్ గా తీసుకున్నాడనే ఫీలింగ్ వస్తుందని ఈ సీజన్ ను ఫాలో అవుతున్న బిగ్ బాస్ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.
మొదటి నుండి సిరి తప్పు చేసిన ఒప్పు చేసిన తనని ఇన్వాల్వ్ చేయకుండా చేస్తే షణ్ముఖ్ తనపై సీరియస్ అవుతున్నాడు.సిరిని తిడుతున్నాడు.ఈ విషయంలో సిరి హార్ట్ అయిన ఆమె వచ్చి బ్రతిమిలాడితే కానీ షణ్ముఖ్ కరగట్లేదు అలాంటి సంప్రదాయానికి నిన్న షణ్ముఖ్ బ్రేక్ చేశారు.జెస్సీ విషయంలో సిరి మాట్లాడుతుంటే వాడ్ని మాట్లాడుకోనివ్వు అని సిరిపై అరిచిన షణ్ముఖ్ తనకు సారీ చెప్పి ఆ గొడవను ప్రోలాంగ్ చేయకుండా ముగించాడు.ఇక ఇలా ప్రతివారం వీళ్ళిద్దరి గొడవను చూస్తున్న జనాలు అస్తమానం కొట్టుకోవడానికి కలిసి ఉండడం కంటే దూరంగా ఉండండి రా బాబు అనుకుంటున్నారు