Biggboss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో తొలి నామినేషన్స్ పర్వం నిన్ననే ముగిసింది. నిజానికి ఈ నామినేషన్స్ సోమవారం జరగాలి కానీ బిగ్‌బాస్ దానిని బుధవారానికి మార్చాడు. ఇక గురు, శుక్రవారాల్లో మాత్రమే ఓటర్లు తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ రెండు రోజుల ఆధారంగానే ఎలిమినేషన్ డిసైడ్ అవుతుంది. అయితే బుధవారానికి మార్చడానికి కారణమైతే తెలియరాలేదు. ఇకపోతే మొదటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. తాము నామినేట్ చేయదలిచిన వారి పేర్లను పేపర్‌పై స్టాంప్ చేసి, దాన్ని ఫ్లష్ చేయాలని బిగ్‌బాస్ సూచించాడు.
నామినేషన్ పర్వాన్ని సింగర్ రేవంత్ ప్రారంభించాడు. మొదటగా రేవంత్ మాట్లాడుతూ.. పని చేయడానికి ముందుకు రావట్లేదంటూ ఫైమా, ఆరోహి రావులను నామినేట్ చేశాడు. తాను నిద్రపోయినప్పుడు కిచకిచమంటూ సూర్యతో ముచ్చట్లు పెడుతూ తన నిద్ర డిస్టర్బ్ చేసిందని ఆరోహిపై ఆరోపణలు గుప్పించాడు. దీనికి ఆ యాంకర్ స్పందిస్తూ.. ఆరోజు మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు మీ దగ్గరకు వచ్చి సారీ కూడా చెప్పానని, అనవసరంగా నన్ను బద్నాం చేయకండి అని గట్టిగానే కౌంటరిచ్చింది. ఆపై తాను 20 మార్కుల ప్రశ్న అడిగితే 2000 మార్కుల సమాధానం చెబుతానంటూ తాను అలాంటి ఆరోపణలను తీసుకోబోనంటూ గట్టిగా తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఫైమాకు, రేవంత్‌కు మధ్య కూడా చిన్నపాటి గొడవ జరిగింది.
Biggboss 6 : నువ్వు ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదు..
ఆ తరువాత కీర్తి భట్ మాట్లాడుతూ.. తనకు, శ్రీహాన్‌కు మధ్య ఉన్న బంధంపై రేవంత్ జోక్ చేశాడని, దీంతో శ్రీహాన్‌ను చోటు భయ్యా అని పిలవాల్సి వచ్చిందని చెప్పింది. తనలా చేయడం వల్ల శ్రీహాన్ సరిగా మాట్లాడటమే మానేశాడని వాపోయింది. దీనికి రేవంత్ కూడా సారీ చెప్పాడు. ఇక మరోవైపు పనుల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవడం లేదని చంటిని నామినేట్ చేసింది. తర్వాత ఆరోహి వంతు రాగా అత్యుత్సాహంతో మీకు తెలీకుండానే అందరినీ హర్ట్ చేస్తున్నావంటూ రేవంత్‌ను, నేను ప్రేమగా శ్రీసత్య అని చాలాసార్లు పిలిచాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదంటూ శ్రీసత్యను నామినేట్ చేసింది. శ్రీసత్య వంతు వచ్చేసరికి.. నా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనుషులతో మాట్లాడటం మానేశా. అందులోనూ కొత్తవాళ్లతో మాట్లాడటానికి టైం పడుతుంది. ముఖ్యంగా తనకు యాటిట్యూడ్ లేదని స్పష్టం చేస్తూ వాసంతి, రాజశేఖర్‌ను నామినేట్ చేసింది. మిగిలిన నామినేషన్ పర్వమంతా వాదోపవాదాలకు తావు లేకుండా సైలెంట్‌గానే సాగిపోయింది.