డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె. దీపికా పదుకునే, దిశా పటాని ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అమితాబచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి సరికొత్త కథాంశంతో ఈ మూవీ ఉండబోతుందని నాగ్ అశ్విన్ గతంలోనే చెప్పారు. ఫ్యూచర్ కంటెంట్ తో మూడో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండే అవకాశం ఉంటుందని టాక్. మహాభారతం నుంచి ఒక లైన్ తీసుకొని దానిని భవిష్యత్తులో జరగబోయే కథకి లింక్ చేసి చెప్పబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ మూవీలో పరశురాముడి పాత్రలో అమితాబచ్చన్ కనిపించే అవకాశం ఉందని టాక్. అలాగే విష్ణుమూర్తి 10వ అవతారం అయిన కల్కిగా ప్రభాస్ పాత్ర ఉండబోతుందని టాక్ నడుస్తుంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. కాని ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన పోస్టర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకులకి అందించింది. ఎప్పటిలాగే ఈ పోస్టర్ లో కూడా ఒక చేతిని మాత్రమే రివీల్ చేసింది. అయితే చేతికి పవర్ ఫుల్ షూట్ ధరించి ఉన్నట్లు ఉంది.
హాలీవుడ్ లో ఐరన్ మెన్ తరహాలో షూట్ ని ప్రభాస్ ఈ మూవీలో ధరిస్తాడని ఈ పోస్టర్ బట్టి అర్ధమవుతుంది. అలాగే ఇందులో ఇండియన్ సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే విషయం క్లారిటీ వచ్చింది. అవెంజర్స్ తరహాలో ఈ మూవీ అడ్వాన్స్ కాన్సెప్ట్ తోనే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు అని అర్ధమవుతుంది. ఈ పోస్టర్ తో సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ కె నుంచి చిన్న అప్డేట్ మాత్రమే ఇచ్చిన సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ని రివీల్ చేసే విధంగా ఇచ్చాడని టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.